పుట:Oka-Yogi-Atmakatha.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

58

ఒక యోగి ఆత్మకథ

చూడ్డానికి కలకత్తా వచ్చి కొన్నాళ్ళు ఉండమనీను. కావలిస్తే తరవాత సాగిద్దువుగాని, ఇక్కడ గురువు కోసం వెదకడం.”

ఈ విషయం దగ్గర అమర్, మా మాటల్లో కలగజేసుకుని, నాతో మళ్ళీ హరిద్వారం వచ్చే ఉద్దేశమేమీ తనకి లేదని ఖండితంగా చెప్పాడు. కుటుంబ సంబంధమైన ఆప్యాయత అనుభవిస్తున్నాడు వాడు. కాని నాకు తెలుసు, నేను మాత్రం గురువు కోసం అన్వేషణ మాననని.

మేమంతా కాశీ వెళ్ళే రైలు ఎక్కాం. అక్కడ నా ప్రార్థనకు సాటిలేని, తక్షణ ఫలితం కనిపించింది.

అనంతన్నయ్య తెలివిగా, ముందే ఒక పథకం వేసి ఉంచాడు. హరిద్వారం వచ్చే లోపున, దారిలో కాశీలో ఆగి ఒక పండితుణ్ణి కలుసుకొని, తరవాత నాతో మాట్లాడేటందుకు ఏర్పాటు చేశాడు. నేను సన్యాసి[1]ని కావాలన్న ఉద్దేశం విరమించుకొనేటట్టు చెయ్యడానికి ప్రయత్నిస్తానని ఆ పండితుడూ ఆయన కొడుకూ అనంతన్నయ్యకి మాట ఇచ్చారు.

అన్నయ్య నన్ను వాళ్ళింటికి తీసుకువెళ్ళాడు. పండితుడుగారి కొడుకు యువకుడే; ముంగిట్లోనే నన్ను మంచి ఉత్సాహంగా పలకరించాడు. నాకు సుదీర్ఘమైన వేదాంతోపన్యాసం ఇచ్చాడు. తనకు, దివ్యదృష్టి వల్ల నా భవిష్యత్తు తెలుసునని నొక్కి చెప్పి, సన్యాసిని కావాలన్న నా ఉద్దేశాన్ని చులకనగా కొట్టిపారేశాడు.

“నీ మామూలు బాధ్యతల్ని విడిచిపెట్టాలన్న పట్టుమీదే కనక నువ్వు ఉన్నట్లయితే, నీ కెప్పుడూ దురదృష్టమే దాపురిస్తుంది; దేవుణ్ణి దర్శించ

  1. సన్యాసం = సమ్ +ని+ అస్ (తోసివెయ్యడం). అన్ని కర్మలనూ కర్మఫలాలనూ భగవంతుడికి అర్పించడం.