పుట:Oka-Yogi-Atmakatha.pdf/774

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

738

ఒక యోగి ఆత్మకథ

భౌతికదేహాన్నీ, పందొమ్మిది సూక్ష్మతత్త్వాలున్న సూక్ష్మదేహాన్నీ వరసగా స్పృహలో ఉంచుకుని, భౌతికలోకానికి సూక్ష్మలోకానికి అటూఇటూ రాకపోకలు సాగిస్తూ ఉండాలి. అయితే భౌతికశరీరం నశించిన తరవాత ప్రతిసారీ, భూమినించి వచ్చిన, అభివృద్ధిచెందని జీవి, చాలామట్టుకు మరణ స్వప్నమనే గాఢసుషుప్తిలో ఉండిపోతాడు; అందమైన సూక్ష్మలోకం అతని స్పృహలో ఉండదు. అటువంటివాడు సూక్ష్మలోక విశ్రాంతి తీసుకున్న తరవాత అనుక్రమ శిక్షణకోసం భౌతికలోకానికి తిరిగి వెళ్తాడు. పదేపదే సాగే రాకపోకలవల్ల అతడు క్రమంగా, సులువుగా అర్థంగాని సూక్ష్మనిర్మాణం గల లోకాలకు అలవాటు పడిపోతాడు.”

“అది అలా ఉండగా, సూక్ష్మవిశ్వంలో మామూలుగా ఉంటున్నవాళ్ళు, లేదా చిరకాలంగా స్థిరనివాసులుగా ఉంటూ వచ్చినవాళ్ళు భౌతిక వాంఛ లన్నిటినించీ విముక్తులయి, భూలోకపు స్థూల స్పందనలకు మళ్ళీ లోనుకావలసిన అవసరం లేనివాళ్ళు. అటువంటి జీవులకు సూక్ష్మ, కారణ కర్మలుమట్టుకే అనుభవించవలసి ఉంటుంది. సూక్ష్మలోకంలో మరణించిన తరవాత ఈ జీవులు అత్యంత సూక్ష్మతరమూ సుందరతరమూ అయిన కారణలోకానికి వెళ్తారు. విశ్వనియమం నిర్ణయించిన ప్రకారం కొంత జీవితకాలం గడిచిన తరవాత, ఈ ప్రగత జీవులు హిరణ్యలోకానికో అలాంటి ఉన్నత సూక్ష్మలోకానికో వెళ్ళి, సూక్ష్మలోక కర్మఫలావశేషాన్ని అనుభవించడానికి ఒక కొత్త సూక్ష్మశరీరంలోకి ప్రవేశిస్తారు.”

“అబ్బాయి, నేను దైవాజ్ఞచేత పునరుత్థానం చెందానని, ఇప్పుడు నువ్వు పూర్తిగా గ్రహించవచ్చు,” అంటూ ఇంకా చెప్పారు శ్రీయుక్తేశ్వర్‌గారు. “అయితే నేను రక్షకుడిగా పనిచేసేది, భూమినుంచి పైకి వచ్చిన సూక్ష్మలోకజీవుల్ని ఉద్ధరించడంకోసం కన్న, ముఖ్యంగా కారణ లోకంనుంచి తిరిగివచ్చి సూక్ష్మలోకంలో పునర్జన్మ ఎత్తిన ఆత్మల్ని