పుట:Oka-Yogi-Atmakatha.pdf/772

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

736

ఒక యోగి ఆత్మకథ

మాత్మగా విస్తరించిన ఆత్మ, వెలుగులేని వెలుగు, చీకటిలేని చీకటి, ఆలోచనలేని ఆలోచన ఉండే ప్రాంతంలోనే, విశ్వసృష్టి అనే దైవ స్వప్నంలో కలిగిన ఆనందాతిశయంతో మత్తెక్కి ఉంటుంది.”

“విముక్తాత్మ!” అంటూ విస్మయంతో పలికాను.

“చివరికి శారీరక భ్రాంతులనే మూడు ఘటాలలోంచి బయటపడ్డ ఆత్మ తన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండానే అనంతంలో ఏకమవుతుంది. క్రీస్తు ఏసుగా పుట్టడానికి పూర్వమే ఈ చరమస్వేచ్ఛ సాధించాడు. ఆయన భూలోక జీవితంలో మరణమూ పునరుత్థానమూ అనే మూన్నాళ్ళ అనుభవంతో సూచితమైన పూర్వదశలు మూడింటిలోనూ ఆయన, పరమాత్మను చేరుకోడానికి కావలసిన సంపూర్ణశక్తిని సాధించాడు.” అన్నారు గురుదేవులు.

“అభివృద్ధిచెందని మనిషి ఈ మూడు శరీరాల్లోంచి బయటపడ్డానికి భూలోకంలోనూ సూక్ష్మలోకంలోనూ లెక్కలేనన్ని జన్మలు ఎత్తవలసి ఉంటుంది. ఈ చరమస్వేచ్ఛ సాధించిన గురువు, ఇతర మానవుల్ని దేవుడి దగ్గరికి తిరిగి తీసుకురావడానికి, భూలోకానికి ప్రవక్తగా తిరిగి వెళ్ళాలని నిశ్చయించుకోవచ్చు, లేకపోతే నాలాగ, సూక్ష్మవిశ్వంలో ఉందామని అనుకోవచ్చు. అక్కడ రక్షకుడు, అక్కడివాళ్ళ కర్మ[1]భారాన్ని కొంత తాను మోస్తూ వాళ్ళు సూక్ష్మవిశ్వంలో మళ్ళీ పుట్టవలసిన అవసరం

  1. ఇక్కడ శ్రీయుక్తేశ్వర్‌గారు సూచించింది ఏమిటంటే, భూమిమీద జన్మించినప్పుడు తాము, శిష్యుల కర్మ తేలిక అయేటట్లు చెయ్యడానికి అప్పుడప్పుడు రోగభారం వహించినట్టే కారణలోకంలో కూడా రక్షకులుగా తాము చేపట్టిన పవిత్రకార్యం హిరణ్యలోకవాసుల సూక్ష్మకర్మలను కొంత తమమీద వేసుకొని, వాళ్ళు అంతకన్న ఉన్నతమైన కారణలోకంలోకి వెళ్ళడానికి వీలుగా వాళ్ళ పరిణామాన్ని త్వరితం చెయ్యడానికి తోడ్పడిందన్న మాట.