పుట:Oka-Yogi-Atmakatha.pdf/771

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీయుక్తేశ్వర్‌గారి పునరుత్థానం

735

అనుభూతి అనే దారిలేని నేలమీద తిరుగుతారు, ఆనందమనే అనంతసాగరంలో ఈదులాడతారు. అవిగో! వాళ్ళ ఉజ్జ్వల భావదేహాలు. అనంతత్వపు ఆకాశరూప ఉరఃస్థలిమీద కోటానుకోట్లుగా పరమాత్మ సృష్టించిన లోకాల్నీ, విశ్వాలనే తాజా బుడగల్నీ, జ్ఞాన తారకల్నీ, సువర్ణ నీహారికల చిత్రవర్ణ స్వప్నాల్నీ దాటి మునుముందుకు దూసుకుపోతున్నాయి.

“అనేక జీవులు కారణలోకంలో వేలకొద్ది సంవత్సరాలు ఉండిపోతారు. గాఢతరమైన ఆనందాతిరేకంవల్ల విముక్తాత్మ అప్పుడు స్వల్పమైన కారణ శరీరంలోంచి బయటికి వచ్చి కారణ విశ్వానికున్న విస్తారత అనే రూపాన్ని ధరిస్తుంది. భావాల వేరువేరు సుడిగుండాలూ ప్రత్యేకీకృత శక్తితరంగాలు, ప్రేమా, ఆనందమూ, శాంతీ, సహజావబోధమూ, ప్రశాంతతా, స్వయంసంయమమూ, ఏకాగ్రతా - ఇవన్నీ కరిగి, పరమానంద సాగరంలో లీనమయిపోతాయి. అటుమీదట ఆత్మ, తానొక వైయక్తికీకృత తరంగంగా ఆనందానుభవం పొందదు; చిరంతన హాసం, ఆహ్లాదాలు, స్పందాలు అనే కెరటాలు గల విశ్వైక మహాసాగరంలో విలీనమయి పోతుంది.”

“ఆత్మ, ఈ మూడు శరీరాల గూళ్ళనూ విడిచేసినప్పుడు, సాపేక్షతానియమం నుంచి తప్పించుకొని, అనిర్వచనీయ నిత్యస్థితం అవుతుంది.[1] సర్వవ్యాపకత్వమనే సీతాకోక చిలకను చూడు; దాని రెక్కలమీద నక్షత్రాలూ చంద్రబింబాలూ సూర్యబింబాలూ చిత్రించి ఉన్నాయి! పర

  1. “అధిగమించి వచ్చినవాడు నా దేవుడుగుడిలో ఒక స్తంభమవుతాడు, ఇక మళ్ళీ బయటికి వెళ్ళడం ఉండదు (అంటే, మళ్ళీ ఇక జన్మ ఎత్తడం ఉండదు) .....అధిగమించి వచ్చినవాడికి నాతోబాటు నా సింహాసనం మీద కూర్చునే అవకాశం ఇస్తాను; నేనూ అలా అధిగమించి వచ్చి నా తండ్రితోబాటు ఆయన సింహాసనం మీద కూర్చున్నట్టుగా” - రివలేషన్ 3 : 12, 21 (బైబిలు)