పుట:Oka-Yogi-Atmakatha.pdf/761

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీయుక్తేశ్వర్‌గారి పునరుత్థానం

725

ద్వారా జరుగుతుంది. మామూలుగా భూమిమీద ఉన్నట్టు, పలికిన మాటకూ రాసిన మాటకూ మధ్య ఉండే గందరగోళం, అపార్థద్యోతకత సూక్ష్మమండల వాసుల్లో లేవు.”

“వెలుతురు కల్పించిన బొమ్మలవరస ద్వారా, సినిమా తెరమీద మనుషులు నిజంగా ఊపిరి తీసుకోకుండానే కదలడం, కార్యకలాపాలు సాగించడం చేస్తున్నట్టుగానే, కాంతే తమకు మూలమై తమను చైతన్య వంతుల్ని చెయ్యడానికి ఆక్సిజన్ ఏదీ అవసరం లేని సూక్షలోక సమన్విత జీవులు నడుస్తారు, పనిచేస్తారు. మానవుడు ప్రధానంగా ఘన, ద్రవ, వాయు పదార్థాలమీదా గాలిలో ఉన్న ప్రాణశక్తి మీదా ఆధార పడి ఉన్నవాడు; కాని సూక్ష్మలోకవాసులు ప్రధానంగా విశ్వకాంతి మీదే ఆధారపడి బతుకుతారు.”

“గురువుదేవా, సూక్మలోక వ్యక్తులు ఏమయినా తింటారాండీ?” నేను ఆయన వివరణను మనస్సు, హృదయం, ఆత్మ అనే నా శక్తులన్నిటి గ్రాహకగుణంతోనూ ఆస్వాదిస్తున్నాను. అధిచేతనానుభూతులు శాశ్వతత్వంగలవి; ఇవి వాస్తవమైనవీ, మార్పులేనివీ; కాని క్షణికమైన ఇంద్రియానుభూతులు తాత్కాలికంగానూ సాపేక్షికంగానూ మాత్రమే నిజమైనవి; వాటి విషయంలో మానవుడికుండే జ్ఞాపకాలు త్వరగానే కరిగిపోతాయి. మా గురుదేవుల మాటలు నా మనఃఫలకం మీద ఎంతగాఢంగా ముద్రవేసుకున్నాయంటే, ఏ సమయంలో నయినా సరే, నా మనస్సును అధిచేతన స్థితిలోకి మార్చుకుని ఆ దివ్యానుభూతిని స్పష్టంగా తిరిగి పొందగలను.”

“సూక్ష్మలోక భూముల్లో వెలుగు రేకల్లాటి కూరగాయలు సమృద్ధిగా ఉంటాయి,” అని జవాబిచ్చారాయన. సూక్ష్మలోకవాసులు పళ్ళూ కూరగాయలు తింటారు. సూక్ష్మలోకంలోని శోభాయమానమైన