పుట:Oka-Yogi-Atmakatha.pdf/760

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

724

ఒక యోగి ఆత్మకథ

సూక్ష్మమండలాల్ని దర్శించలేడు. భూమిమీద ఉండేవాళ్ళు అనేక వేలమంది క్షణికంగా, ఒక సూక్ష్మలోకజీవినో, ఒక సూక్మలోకాన్నో దర్శించినవాళ్ళే.[1]

“హిరణ్యలోకంలో ఉండే, ప్రగతి సాధించిన జీవులు సాధారణంగా సూక్ష్మలోకపు దీర్ఘమైన రాత్రింబగళ్ళలో నిర్వికల్ప ఆనందసమాధిలో జాగృతులై ఉంటారు. విశ్వపరిచాలనానికి సంబంధించిన క్లిష్ట సమస్యల్ని పరిష్కరించడానికి భూలోకయానానికి ఉద్యుక్తులైనవారి ఆత్మల విమోచనకు సహాయపడుతూ ఉంటారు. హిరణ్యలోక జీవులు నిద్రపోయేటప్పుడు, అప్పుడప్పుడు, కలలవంటి సూక్ష్మ అంతర్దర్శనానుభవాలు పొందుతూ ఉంటారు.”

“అయినప్పటికీ, సూక్ష్మవిశ్వంలోని అన్ని ప్రాంతాల్లో ఉండేవాళ్ళూ మనోవేదనలకు గురిఅవుతూ ఉండేవాళ్ళే. హిరణ్యలోకంవంటి గ్రహాలమీద ఉండే మహాభక్తుల సునిశిత మనస్సులు, సత్యవర్తనలో కాని సత్యదర్శనంలో కాని ఏదయినా పొరపాటు జరిగినట్లయితే తీవ్రమైన మనోవేదన పొందుతాయి. ఈ ప్రగతజీవులు తమ ప్రతి చర్యనూ ఆలోచననూ, ఆధ్యాత్మిక నియమ పరిపూర్ణత్వంతో అనుసంధానం కావించుకోడానికి ప్రయత్నిస్తారు.”

"సూక్ష్మలోకవాసులందరి మధ్య భావసంపర్కం పూర్తిగా, మానసిక ప్రసార (టెలిపతీ) సూక్ష్మ దూరదర్శనాల (ఆస్ట్రల్ టెలివిజన్)

  1. భూమిమీద నిర్మలమైన మనస్సుగల పిల్లలు అప్పుడప్పుడు, దేవతల సుందర సూక్ష్మ శరీరాల్ని చూడగలుగుతారు.

    పవిత్ర గ్రంథాలు నిషేధించిన మందుల ద్వారాను, మత్తుపానీయాల ద్వారాను ఎవరయినా, సూక్ష్మనరకాల్లోని జుగుప్సాకరమైన రూపాలు కనిపించేటంతగా మతిభ్రమణం కలిగించుకోవచ్చు.