పుట:Oka-Yogi-Atmakatha.pdf/759

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీయుక్తేశ్వర్‌గారి పునరుత్థానం

723

కొత్తదుస్తులు ధరించినట్లే, సూక్ష్మలోకవాసులు కొన్ని సందర్భాల్లో, ప్రత్యేకంగా కల్పించిన రూపాలు ధరిస్తారు.

“హిరణ్యలోకం వంటి సూక్ష్మ గ్రహాల్లో, అక్కడివాడు ఎవరయినా ఆధ్యాత్మిక ప్రగతిద్వారా విముక్తుడయి, తత్ఫలితంగా కారణ లోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆనందోత్సవాలు జరుగుతాయి. అటువంటి సందర్భాల్లో, అగోచరుడైన పరమేశ్వరుడూ ఆయనలో లీనమైన సాధువులూ, ఆ ఉత్సవాల్లో పాల్గోడానికి దివ్యసుందరమైన సూక్ష్మదేహాలతో సాక్షాత్కరిస్తారు. ప్రభువు తన ప్రియపుత్రుణ్ణి సంతోష పెట్టడానికి అతడు కోరిన రూపం ధరిస్తాడు. భక్తుడు దేవుణ్ణి భక్తితో కొలిచినట్లయితే ఆయన్ని జగన్మాతరూపంలో దర్శిస్తాడు. ఏసుక్రీస్తుకు దేవుణ్ణి గురించి చేసే భావనలన్నిటిలోకీ పితృభావనే ఎక్కువ ఆకర్షంగా ఉండేది. సృష్టికర్త తాను సృష్టించిన ప్రాణుల్లో ప్రతి ఒక్క దానికీ ఇచ్చిన వ్యక్తిత్వం, ఆయన సర్వతోముఖమైన ప్రజ్ఞ వెల్లడి కావాలని, ఊహించడానికి వీలుగానూ ఊహించడానికి వీలులేని విధంగానూ కోరికలు కోరుతుంది!” మా గురుదేవులు నేనూ హాయిగా కలిసి నవ్వుకున్నాం.

“ఇతర జన్మల్లోని స్నేహితులు, సూక్ష్మలోకంలో ఒకరినొకరు సులువుగా గుర్తుపడతారు,” అంటూ శ్రీయుక్తేశ్వర్‌గారు, మధురమైన వేణునాదం వంటి స్వరంతో చెబుతూ వచ్చారు. “స్నేహానికి అమరత్వం ఉన్నందుకు ఆనందిస్తూ వాళ్ళు, పార్థివ జన్మలో భ్రాంతిమయమైన వియోగాలు జరిగే విషాద సమయంలో తరచు శంకిస్తూ వచ్చిన, ప్రేమ అవినశ్వరతను ఇప్పుడు అనుభూతం కావించుకుంటారు.”

“సూక్ష్మలోక వ్యక్తులు సహజావబోధంవల్ల, తెర చీల్చుకొని మానవ కార్యకలాపాల్ని గమనిస్తూ ఉంటారు; కాని మానవుడు మాత్రం, అతని ఆరో జ్ఞానేంద్రియం కొంతమట్టుకు వికాసంచెంది ఉండకపోతే