పుట:Oka-Yogi-Atmakatha.pdf/757

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీయుక్తేశ్వర్‌గారి పునరుత్థానం

721

సృష్టించవచ్చు. అంతకుముందే భౌతికకాయాన్ని విడిచిన వ్యక్తి, అనురూపమైన మానసిక, ఆధ్యాత్మిక ప్రవృత్తులచేత ఆకృష్టుడై, ఒక సూక్ష్మలోక కుటుంబం ఆహ్వానాన్ని అందుకొని, ఆ కుటుంబంలోకి వస్తాడు.

“సూక్ష్మశరీరం చలికికాని వేడికికాని ఇతర ప్రకృతి పరిస్థితులకుకాని లోబడదు. సూక్ష్మశరీరంలో సూక్ష్మమస్తిష్కం ఒకటి ఉంటుంది; దాంట్లో, సర్వజ్ఞత్వం గల ‘వెయ్యి రేకుల వెలుగుల తామరపువ్వు’ కొంతమట్టుకు చురుకుగా పనిచేస్తూ ఉంటుంది; అలాగే, ‘సుషుమ్న’లో, అంటే సూక్ష్మ మస్తిష్క-మేరు దండాక్షంలో, జాగృత కేంద్రాలు ఆరు ఉంటాయి. గుండె, వెలుగునూ విశ్వశక్తినీ మెదడునుంచి, తీసుకొని సూక్ష్మనాడులకూ శరీరకణాలకూ పంపిణీ చేస్తుంది. సూక్ష్మలోక జీవులు ప్రాణకణికాశక్తి వల్లా పవిత్ర మంత్ర స్పందనలవల్లా తమ రూపాల్లో మార్పులు చేసుకొంటూ ఉంటారు.

“చాలా సందర్భాల్లో, సూక్ష్మశరీరం, ముందటి భౌతికరూపానికి అచ్చంగా ప్రతిరూపంలా ఉంటుంది. సూక్ష్మలోక వ్యక్తి ముఖము ఆకారమూ అంతకు ముందు భూమిమీద చేసిన మజిలీలో, అతని పడుచు ప్రాయంలో ఎలా ఉండేవో అలా ఉంటాయి. కాని అప్పుడప్పుడు, నాబోటివాడు ముసలిరూపే నిలుపుకోవాలని తలుస్తాడు.” యువతాసక్తి ఉట్టిపడే గురుదేవులు, సవిలాసంగా ముసిముసి నవ్వులు నవ్వారు.

“సూక్ష్మమండలాలు, పంచేంద్రియ జ్ఞానంతో గ్రహించదగ్గ అంతరాళిక త్రిమితీయ ప్రపంచం మాదిరిగా కాకుండా, అన్నీ కలిసి ఉన్న సహజావబోధమనే ఆరో జ్ఞానేంద్రియానికి గోచరమవుతాయి.” అంటూ ఇంకా ఇలా చెప్పారు శ్రీయుక్తేశ్వర్‌గారు. “సూక్షలోక వ్యక్తులు కేవలం, సహజావభోదానుభూతివల్ల చూస్తారు, వింటారు. వాసన చూస్తారు రుచి చూస్తారు, తాకుతారు. వాళ్ళకి మూడు కళ్ళు ఉంటాయి, వాటితో