పుట:Oka-Yogi-Atmakatha.pdf/748

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం : 43

శ్రీయుక్తేశ్వర్‌గారి

పునరుత్థానం

“కృష్ణభగవానుడు!” నేను బొంబాయిలో, రీజెంట్ హోటల్లో నా గదిలో కూర్చుని ఉండగా, ఆ అవతారమూర్తి దివ్యమంగళరూపం ఒక ఉజ్జ్వల దీప్తితో నాకు దర్శన మిచ్చింది. నేను మూడో అంతస్తులో ఉన్నాను; కిటికీ తెరిచి ఉంది; దాంట్లోంచి బయటికి చూస్తూ ఉండగా, వర్ణించశక్యంకాని ఆ అద్భుతదృశ్యం, వీధికి అవతలివేపు ఎత్తయిన ఒక భవనం పై కప్పుమీద హఠాత్తుగా నా కంట పడింది.

చిరునవ్వు చిందిస్తూ, పలకరింపుగా తల ఆడిస్తూ, ఆ దివ్యమంగళ విగ్రహుడు నా వేపు చెయ్యి ఊపాడు. కృష్ణభగవానుడిచ్చిన సందేశాన్ని నేను సరిగా అర్థం చేసుకోలేకపోవడంవల్ల ఆయన ఆశీః సంకేతంతో అంతర్ధానమయాడు. అద్భుతమయిన దివ్యానుభూతితో ఉత్తేజం పొందిన నాకు, ఏదో ఆధ్యాత్మిక సంఘటన జరగబోతున్నదన్న అభిప్రాయం కలిగింది. నా పాశ్చాత్యదేశ యాత్ర తాత్కాలికంగా వాయిదా పడింది. మళ్ళీ మరోసారి కలకత్తా, పూరీ వెళ్ళేలోగా బొంబాయిలో కొన్ని బహిరంగ సభల్లో నేను ఉపన్యాసాలివ్వడానికి కార్యక్రమాలు నిర్ణయమయాయి.

1936 జూన్ 19 తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు - అంటే, శ్రీకృష్ణుడు దర్శనమిచ్చిన వారం రోజులకు- బొంబాయి హోటల్లో నేను