పుట:Oka-Yogi-Atmakatha.pdf/747

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురుదేవుల సన్నిధిలో చివరి రోజులు

711

కలుసుకోడానికి నీ స్నేహితుల్ని తీసుకువచ్చి, “ఇదుగో చూడండి, భారతదేశ జ్ఞానావతారులు ఆయన,” అని సగర్వంగా చెప్పలేవు.

మా బృందం జూన్ నెల తొలినాళ్ళలో బొంబాయినించి బయలుదేరి పాశ్చాత్యదేశాలకు వెళ్ళడానికి శ్రీ రైట్ ఏర్పాట్లు చేశాడు. మే నెలలో కలకత్తాలో వీడ్కోలు విందులూ, ప్రసంగాలు జరిగిన తరవాత పదిహేను రోజులకు, మిస్ బ్లెట్ష్, శ్రీ రైట్, నేనూ ఫోర్డు కారులో బొంబాయికి బయలుదేరాం. మేము అక్కడికి చేరిన తరవాత ఓడ అధికారులు మా ప్రయాణం రద్దు చేసుకోమన్నారు; మా ఫోర్డు కారుకు ఆ ఓడలో చోటు లేకపోవడమే దానికి కారణం; ఆ కారు మళ్ళీ మాకు యూరప్‌లో అవసరమవుతుంది.

“పరవాలేదు,” అన్నాను శ్రీ రైట్‌తో విషాదంగా. “నేను మళ్ళీ ఒకసారి పూరీ వెళ్ళాలనుకుంటున్నాను.” అని మనస్సులో ఇలా అనుకున్నాను, “మళ్ళీ మరోసారి నా కన్నీళ్ళు, గురుదేవుల సమాధిని తడపాలి.”