పుట:Oka-Yogi-Atmakatha.pdf/732

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

696

ఒక యోగి ఆత్మకథ

ఆ ఆశ్రమం హాలులో ఒక వేదిక మీద కూర్చున్న అంధసాధువు ‘ప్రజ్ఞా చక్షువు’[1]; శాస్త్రాలు గాఢంగా అధ్యయనం చేసిన పండితుడాయన; అన్ని సంప్రదాయాలవాళ్ళూ ఆయన్ని ఘనంగా గౌరవిస్తారు.

నేను వేదాంతం గురించి హిందీలో సంగ్రహంగా ఒక ప్రసంగం చేసిన తరవాత, మేము ప్రశాంతమైన ఆ ఆశ్రమంలోంచి బయటికి వచ్చి దగ్గరలో మరో స్వామిని సందర్శించాం. గులాబివన్నె చెక్కిళ్ళు, ధృడమైన భుజాలు కలిగి సుందరరూపులయిన ఆ సన్యాసిపేరు కృష్ణానందగారు. ఆయన దగ్గర పెంపుడు ఆడసింహం ఒకటి పడుకొని ఉంది. ఆ అడవి జంతువు ఆ సన్యాసి ఆధ్యాత్మికాకర్షణకు లోబడి (ఆయన శరీర దార్ఢ్యానికి మాత్రం కాదని కచ్చితంగా చెప్పగలను!) అన్నం, పాలూ తప్ప మాంస మేదీ ముట్టదు. పచ్చని జూలుగల ఈ జంతువుకు, దీర్ఘ గంభీర గర్జనలో ఓంకార నాదం చెయ్యడం నేర్పారు ఆ స్వామి. అదొక పిల్లిజాతి భక్తురాలు!

ఆ తరవాత చెప్పుకోదగ్గది, ఒక పండిత యువసాధువుతో జరిగిన సంభాషణ. దాన్ని గురించి శ్రీ రైట్, తన యాత్రా దినచర్య పుస్తకంలో ఇలా రాశాడు:

“మేము ఫోర్డుకారులో, కిర్రుకిర్రుమనే బల్లకట్టు వంతెనమీద, దిగువ మట్టంలో ప్రవహిస్తున్న గంగానదిని దాటాం; ఆ జనసమ్మర్థంలో పాము పాకినట్టుగా ముందుకు సాగి, సన్న సన్నటి వంకర సందుల్లోంచి వెళ్ళి, ఏటి ఒడ్డుకు చేరినప్పుడు, యోగానందగారు, బాబాజీ, శ్రీయుక్తేశ్వర్‌గారూ కలుసుకున్న స్థలంవేపు చూపించారు. కాసేపటికి మేము కారులోంచి దిగి, సాధువులు వేసిన మంటలనుంచి దట్టంగా వస్తున్న పొగ

  1. (భౌతికదృష్టి లేకుండా) “తన జ్ఞానంతోనే చూసే వ్యక్తి” అన్న అర్థంగల ఒక బిరుదు.