పుట:Oka-Yogi-Atmakatha.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

52

ఒక యోగి ఆత్మకథ

“ఊఁ– నిజం చెప్పండి!” అనీ రెట్టించాడు.

“అయ్యా, మీరు కళ్ళజోడు ధరించినట్టు కనిపిస్తోంది మరి; ఇక్కడున్నది మే మిద్దరమేనని తెలియడం లేదా?” అంటూ అమర్ నిర్భయంగా చిరునవ్వు నవ్వాడు. “నే నేమీ మాంత్రికుణ్ణి కాను; మూడోవాణ్ణి ఇక్కడ ప్రత్యక్షం చెయ్య లేను,” అన్నాడు.

ఈ మొండి జవాబుకు చిరాకు కలిగినట్టుంది ఆ ఉద్యోగికి; మరో వేపు నుంచి దాడి మొదలుపెట్టాడు. “నీ పేరేమిటి?”

“నన్ను. థామస్ అంటారు. మా అమ్మ ఇంగ్లీషుది; మా నాన్న క్రైస్తవమతం పుచ్చుకున్న భారతీయుడు.”

“మీ స్నేహితుడి పేరేమిటి?”

“థాంప్సన్ అని పిలుస్తాను.”

అంతవరకు నాలో అణిచిపెట్టుకున్న కులుకు, దాంతో పై స్థాయికి చేరుకొంది. అదృష్టవశాత్తు, అప్పుడే బయలుదేరడానికి సిద్ధంగా కూత కూస్తున్న రైలుబండి వేపు నడిచాను నేను, వాళ్ళతో చెప్పకుండానే. ఎదుటివాళ్ళ మాటల్ని సులువుగా నమ్మే స్వభావంగల ఆ ఉద్యోగితోబాటు అమర్ కూడా నా వెంట వచ్చాడు. ఉపకారబుద్ధితో ఆయన, యూరోపియన్లు కూర్చునే పెట్టెలోకి ఎక్కించాడు మమ్మల్ని. సగం ఇంగ్లీషు పుట్టుక పుట్టిన కుర్రవాళ్ళిద్దరు, నాటు మనుషులకోసం కేటాయించిన పెట్టెలో కూర్చుని ప్రయాణం చెయ్యాలేరు అన్న ఆలోచనతో ఆయన మనస్సు నొచ్చుకున్నట్టుంది. ఆయన మర్యాదగా నిష్క్రమించిన తరవాత నేను సీటుకు చేర్లబడి కడుపుచెక్కలయేలా నవ్వాను. మంచి అనుభవజ్ఞు డయిన ఒక యూరోపియన్ అధికారిని బోల్తా కొట్టించామన్న ఉల్లాసభరిత మైన సంతృప్తి అమర్ ముఖంలో స్పష్టంగా కనిపించింది.