పుట:Oka-Yogi-Atmakatha.pdf/728

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

692

ఒక యోగి ఆత్మకథ

మాటల్లో వెలువడకపోయినా, హృదయానికి అనుభూతమయే మా గురుదేవుల ప్రేమలో ప్రతిరోజూ ఓలలాడుతూ, ఆసన్నమవుతున్న మరణాన్ని గురించి ఆయన చేసిన రకరకాల సూచనల్ని నా మనస్సులోంచి తొలగించేశాను.

"గురుదేవా, అలహాబాదులో ఈ నెల కుంభమేళా జరుగుతోందండి,” అంటూ మేళా జరిగే తిథులు ఒక బెంగాలీ పంచాంగంలో గురుదేవులకు చూపించాను.[1]

“నీకు నిజంగా వెళ్ళాలని ఉందా?”

నేను తమను విడిచివెళ్ళడం శ్రీయుక్తేశ్వర్ గారికి ఇష్టం లేదన్న సంగతి పసిగట్టకుండా నేను, “ఒకసారి అలహాబాదులో జరిగిన కుంభ

  1. ప్రాచీన గ్రంథమైన మహాభారతంలో మతపరమైన మేళాలగురించి ప్రస్తావించడం జరిగింది. హ్యూయాన్ త్సాంగ్ అనే చైనా యాత్రికుడు క్రీ. శ. 644 లో అలహాబాదులో జరిగిన పెద్ద కుంభమేళాను గురించి రాశాడు. ‘కుంభమేళా’ అన్నది ప్రతి మూడో సంవత్సరం వరసగా, హరిద్వారం, అలహాబాదు, నాసిక, ఉజ్జయిని క్షేత్రాల్లో జరుగుతూంటుంది. ఆ తరవాత మళ్ళీ హరిద్వారంలో జరిగే నాటికి పన్నెండేళ్ళ ఆవృత్తి పూర్తి అవుతుంది. వాటిలో ప్రతి పట్నం కుంభమేళా జరిగిన తరవాత ఆరో సంవత్సరంలో ‘అర్ధ కుంభమేళా’ జరుపుకుంటుంది; ఆ ప్రకారంగా వివిధ పట్నాల్లో మూడేళ్ళకొకసారి కుంభమేళా, అర్థ కుంభమేళా జరుగుతూ ఉంటాయి.

    ఉత్తర భారతాన్ని ఏలిన హర్షుడు, రాజు ధనాగారంలో ఉన్న సంపదనంతనీ (ఐదేళ్ళలో కూడ బెట్టినది) కుంభమేళాలో సన్యాసులకూ యాత్రికులకూ పంచిపెట్టాడని హ్యూయన్ త్సాంగ్ చెబుతున్నాడు. హ్యూయన్ త్సాంగ్ చైనాకు తిరిగి వెళ్ళేటప్పుడు వీడ్కోలు సందర్భంగా హర్షుడిచ్చిన అమూల్యాభరణాల్నీ బంగారాన్నీ అతడు కాదని, మత సంబంధమైన 657 రాత ప్రతులను అంతకంటె విలువయినవిగా భావించి తనతో తీసుకుపోయాడు.