పుట:Oka-Yogi-Atmakatha.pdf/710

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

674

ఒక యోగి ఆత్మకథ

ఆశ్చర్యపోయిన సంగతి చారిత్రకులు నమోదు చేశారు. దహనానికి వెళ్ళే ముందు కలనోస్, తన సన్నిహిత సహచరుల్ని చాలామందిని ఆలింగనం చేసుకున్నాడు కాని అలెగ్జాండరుకు మాత్రం వీడ్కోలు చెప్పడం మానేసి ఆ హిందూ ముని, టూకీగా ఇలా చెప్పాడు:

“నిన్ను తరవాత బాబిలాన్‌లో చూస్తాను.”

అలెగ్జాండరు పెర్షియా విడిచి వెళ్ళాడు; ఒక ఏడాది తరవాత బాబిలాన్‌లో చనిపోయాడు. అలెగ్జాండరు బతికున్నప్పుడూ చనిపోయేటప్పుడూ కూడా తాను హాజరుగా ఉంటానని చెప్పడానికి భారతీయ గురువు అనుసరించిన తీరే ఆ జోస్యం.

గ్రీకు చారిత్రకులు మనకోసం, భారతీయ సమాజాన్ని గురించి వివరణాత్మకంగానూ స్ఫూర్తిమంతంగానూ రాసిపెట్టారు. హిందూ ధర్మశాస్త్రం ప్రజల్ని కాపాడుతుందని చెబుతూ ఏరియన్, “వాళ్ళలో ఎవ్వడూ

ఏ పరిస్థితిలోనూ బానిస కాగూడదు; అలా కాకుండా వాళ్ళు తమ స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తూ, మనుషులందరికీ ఉండే సమాన హక్కును గౌరవిందాలి,”[1] అని అది నిర్దేశిస్తుందని అన్నాడు.

  1. భారతదేశంలో బానిసతనం లేకపోవడాన్ని గురించి గ్రీకు పరిశీలకు లందరూ వ్యాఖ్యానించారు; హెలెనిక్ సమాజ వ్యవస్థకు పూర్తిగా భిన్నమైన లక్షణమిది. ప్రొ॥ వినయకుమార్ సర్కార్ రాసిన ‘క్రియేటివ్ ఇండియా’ (సృజనాత్మక భారతదేశం) అన్న గ్రంథంలో భారత దేశం పాటించిన ప్రాచీన, ఆధునిక విజయాల సమగ్ర స్వరూపాన్ని, అర్థశాస్త్రం, రాజనీతిశాస్త్రం, సాహిత్యం, కళ, సమాజతత్త్వశాస్త్రం అన్నవాటిలో ఉన్న ప్రత్యేకమైన విలువల్ని పేర్కొనడం జరిగింది. (లాహోరు: మోతీలాల్ బనార్సీ - ప్రచురణ కర్తలు, 1937, పుట 714).

    చదవదగ్గ మరో గ్రంథం, ఎస్. వి. వెంకటేశ్వర రాసిన “ఇండియన్ కల్చర్ త్రూ ఏజెస్” (యుగయుగాలుగా భారతీయ సంస్కృతి) (న్యూయార్కు: లాంగ్మన్స్, గ్రీన్ అండ్ కంపెనీ)