పుట:Oka-Yogi-Atmakatha.pdf/709

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దక్షిణ భారత విహారయాత్ర

673

“దినం ఒక దినం ముందునుంచి ఉంది.” ఈ జవాబుకు అలెగ్జాండరు ఆశ్చర్యం ప్రకటించాడు; బ్రాహ్మణుడు ఇంకా ఇలా అన్నాడు: “అసాధ్యమైన ప్రశ్నలకు అసాధ్యమైన సమాధానాలే అవసరం.”

“మనిషి తనను ప్రేమపాత్రుడిగా చేసుకోడంలో ఉత్తమ పద్ధతి ఏమిటి?”

“తనకు గొప్పశక్తి ఉండి కూడా, తానంటే ఇతరులు భయపడేటట్టు చేసుకోకుండా ఉంటే మనిషి ప్రేమపాత్రు డవుతాడు.”

“మనిషి దేవుడు ఎలా కావచ్చు?”[1]

“మనిషికి అసాధ్యమయింది చెయ్యడంవల్ల.”

“బలవత్తరమయింది ఏది? బతుకా, చావా?”

“బతుకు; అది అనేక చెడ్డల్ని భరిస్తుంది కనక.”

అలెగ్జాండరు తనకు గురువుగా, ఒక నిజమైన యోగిని భారత దేశం నుంచి తీసుకువెళ్ళడంలో కృతకృత్యుడయాడు. ఈయన పేరు కల్యాణ స్వామి (స్వామి స్ఫైన్స్); గ్రీకులు ఈయన్ని ‘కలనోస్’ అనేవారు. ఈ యోగి, అలెగ్జాండరు వెంబడి పెర్షియా వెళ్ళాడు. ముందుగా చెప్పిన ఒక రోజున పెర్షియాలో సూసా అనేచోట కలనోస్, మాసిడోనియా సైన్యం యావత్తు చూస్తూ ఉండగా చితిలోకి ప్రవేశించి ముసలితనంతో పండిపోయిన దేహాన్ని విడిచిపెట్టేశాడు. ఈ యోగి, బాధకుగాని చావుకుగాని భయపడకపోవడం, తాను అగ్నికి ఆహుతి అవుతూ ఉంటే కూచున్న చోటినించి ఒక్కసారి కూడా కదలకపోవడం చూసి సైనికులు

  1. ఈ ప్రశ్ననుబట్టి, ఆ “జియిస్ కుమారుడికి” తానింకా పరిపూర్ణత సాధించలేదేమో నన్న సందేహం అప్పుడప్పుడు వస్తూ ఉండేదని మనం ఊహించవచ్చు