పుట:Oka-Yogi-Atmakatha.pdf/702

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

666

ఒక యోగి ఆత్మకథ

మైన మక్కామసీదు శోభ చేకూరుస్తున్నాయి. ఈ మసీదులో తరచుగా పదేసి వేలమంది ప్రార్థనకోసం వచ్చి చేరుతూంటారు.

సముద్ర మట్టానికి మూడువేల అడుగుల ఎత్తున ఉన్న మైసూరు రాజ్యం, దట్టమైన ఉష్ణమండలారణ్యాలకూ పులులకూ పేరెన్నిక గన్నది. ఇందులో ముఖ్యనగరాలైన బెంగుళూరు మైసూరూ, ఎన్నో అందమైన పార్కులతోనూ సార్వజనిక విహార వనాలతోనూ పరిశుభ్రంగా, ఆకర్షకంగా ఉన్నాయి.

వాస్తుకళ, శిల్పకళ, మైసూరులో పదకొండో శతాబ్దినుంచి పదిహేనో శతాబ్ది వరకు పాలించిన హిందూరాజుల పోషణలో సర్వోన్నత పరిపూర్ణత సాధించాయి. విష్ణువర్ధన రాజు పాలనలో నిర్మాణం పూర్తి అయిన - పదకొండో శతాబ్ది మహోత్తమ సృష్టి- బేలూరు ఆలయాన్ని మించినది, సున్నితమైన చికిలిపనిలో సమృద్ధమైన రూపకల్పనలో ప్రపంచంలో మరొకటి లేదు.

ఉత్తర మైసూరులో కనిపించే శిలాశాసనాలు క్రీ. పూ. మూడో శతాబ్దినాటివి. అవి, భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్‌లతో సహా విశాల సామ్రాజ్యాన్ని పాలించిన అశోక చక్రవర్తి[1] సంస్కృతిని దీప్తి మంతం చేసే దీపకళికలు. వివిధ భాషల్లో చెక్కిన అశోకుడి “ధర్మ

  1. అశోక చక్రవర్తి భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో మత ధార్మిక స్తూపాలు (గుళ్ళు) 84,000 నిర్మించాడు. పద్నాలుగు శిలాశాసనాలూ, పది శిలా స్తంభాలూ ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. ప్రతి స్తంభమూ, ఇంజినియరింగ్, వాస్తు, శిల్ప కళలకు విజయ స్తంభం. ఈయన ఎన్నో జలాశయాలూ ఆనకట్టలూ పారుదల నీటి తూములూ కట్టించాడు; పెద్ద పెద్ద రహదారులూ చెట్ల నీడపడే రోడ్లూ వేయించి ప్రయాణికుల కోసం అక్కడక్కడ సత్రాలు కట్టించాడు; వృక్షశాస్త్రాధ్యయనానికి మందులకూ ఉపయోగపడే తోటలు వేయించాడు; మనుషులకోసం, జంతువులకోసం వైద్యశాలలు కట్టించాడు.