పుట:Oka-Yogi-Atmakatha.pdf/701

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దక్షిణ భారత విహారయాత్ర

665

పడ్డానికి కాని సంభ్రమాశ్చర్యాలవంటివి ప్రకటించడానికి కాని అవకాశం లేనంతగా పులకించిపోయాను, అయితే ప్రియమైన నా ప్రాణాన్ని కాపాడుకోడానికి ఉగ్గబట్టుకొనే ఉన్నాను స్మీ!”

చారిత్రక , పురాతత్త్వ ప్రాముఖ్యమున్న అవశేషాలు సమృద్ధిగా గల దక్షిణ భారతదేశం, నిశ్చితమైనప్పటికీ అనిర్వచనీయమైన ఆకర్షణ గల ప్రాంతం. మైసూరుకు ఉత్తరాన, హైదరాబాదు రాజ్యం ఉంది; బ్రహ్మాండమైన గోదావరీనది పారే అందమయిన పీఠభూమి ఇది. సువిశాలమై, సారవంతమై ఉన్న సమతల భూములూ, రమణీయమయిన నీలగిరులూ, సున్నపు రాతితోనో గ్రెనైట్ రాతిలోనో ఏర్పడ్డ నిర్జీవ పర్వతాల ఇతర ప్రదేశాలూ. హైదరాబాదు చరిత్ర సుదీర్ఘమైన ఉజ్జ్వల గాథ. అది మూడువేల ఏళ్ళ క్రిందట ఆంధ్ర రాజుల ఏలుబడితో మొదలయి, క్రీ. శ. 1294 లో ఆ ప్రాంతం ముస్లిం నవాబుల వంశానుగత పాలనలోకి పోయేవరకు హిందూ రాజవంశీయుల పాలనలోనే కొనసాగింది.

భారతదేశమంతటిలోకీ అత్యంత అద్భుతమైన వాస్తు, శిల్ప, చిత్రకళా నైపుణ్యాల్ని ప్రదర్శించే కళాఖండాలు హైదరాబాదు రాజ్యంలో రాళ్ళను మలిచి నిర్మించిన ఎల్లోరా, అజంతాల ప్రాచీన గుహాలయాలు. ఎల్లోరాలో ఒక పెద్ద ఏకాండి శిలను తొలిచి రూపొందించిన కైలాసనాథాలయంలో, ఏ మైఖేలేంజిలో లాంటివాడో భారీ పరిమాణాల్లో చెక్కిన దేవతా విగ్రహాలూ, మనుషుల బొమ్మలూ జంతువుల బొమ్మలూ ఉన్నాయి. ఇరవై ఐదు సన్యాసి ముఠాలూ, ఐదు ఆలయాలూ గల ప్రదేశం అజంతా; రాతికొండను తొలిచి రూపొందించినవే ఇవన్నీ; వీటికి ఆధారంగా ఉన్నవి చిత్రాలంకృతమైన స్తంభాలు. చిత్రకారులూ శిల్పులూ వీటిమీద, తమ ప్రతిభకు అమరత్వం సిద్ధింపజేసుకున్నారు.

హైదరాబాదు నగరానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం, బ్రహ్మాండ