పుట:Oka-Yogi-Atmakatha.pdf/700

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

664

ఒక యోగి ఆత్మకథ

దట్టంగా ఉన్నాయి చెట్లూ చేమలూ. చివరికి, ఒక కొండ కొమ్ముకు చేరి మానవ నిర్మితమైన బ్రహ్మాండమైన ఒక సరస్సును చూశాం. నక్షత్రాలూ కొబ్బరిచెట్లూ మొదలయినవి అందులో ప్రతిఫలిస్తున్నాయి. ఆ సరస్సు చుట్టూ అందమైన మిట్టతోటలూ విద్యుద్దీపాల పంక్తులూ శోభాయమానంగా ఉన్నాయి.”

“ఆ ఆనకట్ట అంచుకు దిగువున, కళ్ళు మిరుమిట్లు గొలిపే దృశ్యం ఒకటి చూశాం: ఎగజిమ్మే నీటిబుగ్గల మీద వన్నె వన్నెల కాంతికిరణాలు ప్రసరిస్తూ ఉంటే, మిలమిలలాడే నీలివన్నె జలపాతాలు, కంటిని ఆకట్టుకునే ఎరుపు, ఆకుపచ్చ, పసుప్పచ్చ వన్నెల నీటి జల్లులూ, ముదురువన్నె సిరాలు వెలువరిస్తున్నట్టుగా ఉన్నాయి; రాజసం ఉట్టిపడే రాతి ఏనుగులు, ఏకధారగా నీటిని ఎగజిమ్ముతున్నాయి. (దీపాలు అమిర్చిన ఈ నీటి బుగ్గల్ని చూస్తున్నప్పుడు, షికాగోలో 1933 లో జరిగిన వరల్డ్ ఫెయిర్‌లో అమిర్చినవి గుర్తువచ్చాయి నాకు). వరిపొలాలతో నిండి, నిరాడంబరులయిన ప్రజలుగల ఈ ప్రాచీన దేశంలో ఈ ఆనకట్ట, ఆధునికంగా విశిష్టత నందుకొన్నది. భారతీయులు మాకు ఎంత ప్రేమపూర్వకమైన స్వాగతం ఇచ్చారంటే, యోగానందగారిని తిరిగి అమెరికాకు తీసుకు వెళ్ళడానికి నా శక్తి చాలదేమో అన్నంత భయం వేసింది.”

“మరో అపురూపమైన సదవకాశం - నేను మొట్టమొదటిసారిగా ఏనుగు మీద సవారి చేయడం. యువరాజావారు నిన్న, తమ ఏనుగుల్లో ఒకదాని మీద సవారిచేసి ఆనందించడానికి మమ్మల్ని తమ వేసవి విడిది భవనానికి ఆహ్వానించారు. భారీ పరిమాణంగల ఏనుగుమీద పట్టుపరుపులతో ఒక పెట్టె మాదిరిగా అమిర్చి ఉన్న హౌదా మీదికి నేను ఒక నిచ్చెన మీంచి ఎక్కాను. ఆ తరవాత ఊగులాటలూ, కుదుపులూ, నిట్టూర్పులూ, ఏదో లోయలోకి తోసేస్తున్నట్టుగా విసిరివేతలూ - గాభరా