పుట:Oka-Yogi-Atmakatha.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హిమాలయాలకు పారిపోతుంటే ఆటంకం

49

“మనకింక కావలసినవల్లా కేన్వాసు బూట్లు,” అని అంటూ, అడుగున రబ్బరు వేసిన బూట్లు అమ్మకానికి పెట్టిన దుకాణానికి మా స్నేహితుల్ని తీసుకువెళ్ళాను. “తోలుతో చేసినవన్నీ జంతువుల్ని చంపగా తయారయినవే కనక, ఈ పవిత్ర యాత్రలో మన దగ్గర అలాటివి ఉండకూడదు.” అన్నాను, నా భగవద్గీతకున్న తోలు అట్టా, ఇంగ్లండులో తయారైన నా సోలా టోపీ (హెల్మెట్) కి ఉన్న తోలుపట్టీలు తీసి పారెయ్యడానికి నేను వీధిలో ఆగాను.

స్టేషనులో మేము బర్ధ్వాన్‌కు టిక్కెట్లు కొన్నాం. హిమాలయాల దిగువ కొండల్లో ఉన్న హరిద్వారం చేరడానికి అక్కడ రైలు మారాలని నిర్ణయించుకొన్నాం. మాలాగే ఆ రైలుబండి కూడా ఉరకడం మొదలు పెట్టగానే, నాలో ఉన్న ఆశాభావాలను స్నేహితులకు వెల్లడించాను.

“ఒక్కసారి ఊహించుకోండి! గురువులు మనకి దీక్ష ఇస్తారు. మనం సమాధిస్థితి అనుభవం పొందుతాం. అప్పుడు మన శరీరాలకు వచ్చే దివ్యమైన ఆకర్షణ శక్తి వల్ల హిమాలయాల్లో ఉండే క్రూర మృగాలు మన దగ్గిరికి సాధుజంతువుల్లా వస్తాయి. మన లాలింపుకోసం ఎదురుచూస్తూ పులులు, పెంపుడు పిల్లుల్లా ఉంటాయి!”

ఆలాంకారికంగానూ అక్షరాలా కూడా- రెండు విధాలా సమ్మోహ పరిచే విధంగా భావిస్తూ భవిష్యత్తును చిత్రిస్తూ నేనన్న ఈ మాటలకు, అమర్ పెదవులమీద ఉత్సాహంగా చిరునవ్వు విరిసింది. కాని జతీన్‌దా చూపు తప్పించాడు; వెనక్కి పరుగులు తీస్తున్న నేలవేపు, కిటికీలోంచి చూపు సారించాడు.

‘‘ఉన్న డబ్బు మూడు వాటాలు చెయ్యాలి.” చాలాసేపు మౌనంగా ఉన్న తరవాత జతీన్‌దా చేసిన సూచన ఇది. “బర్ద్వాన్‌కు మనం ఎవరి