పుట:Oka-Yogi-Atmakatha.pdf/693

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారతదేశానికి తిరిగి రాక

657

స్కుడై, రెప్పలార్పకుండా జ్ఞాననేత్రం వేపు చూపు సారించి, గంటకు పైగా అలాగే నిలిపి కూర్చుని ఉండడం రాంచీలో వింతేమీ కాదు.

పండ్ల తోటలో ఒక శివాలయ ముంది. పూజ్యపాదులైన పరమ గురువులు లాహిరీ మహాశయుల విగ్రహం ఒకటి అక్కడ ఉంది. నిత్య ప్రార్థనలూ పవిత్ర గ్రంథబోధన తరగతులూ తోటలో మామిడిచెట్ల గుబురుల నీడన జరుగుతూ ఉంటాయి.

రాంచీ ఎస్టేట్‌లో ఉన్న యోగదా సత్సంగ సేవాశ్రమం భారత దేశంలోని వేలాదిమంది బీదవాళ్ళకు ఉచిత వైద్యసహాయం, శస్త్ర చికిత్సా సదుపాయం చేస్తూంటుంది.

రాంచీ సముద్ర మట్టానికి 2,000 అడుగుల ఎత్తున ఉంది. వాతావరణం మందంగా, సమశీతోష్ణంగా ఉంటుంది. డెబ్భై బిగాల భూమిలో దేశమంతటిలోకి చక్కనిదని చెప్పదగ్గ పండ్లతోట కూడా ఒకటి ఉంది; అందులో ఐదువందల ఫలవృక్షాలున్నాయి - మామిడి, ఖర్జూరం, జామ, లీచీ, పనస.

రాంచీ గ్రంథాలయంలో అనేక పత్రికలూ, ఇంగ్లీషూ బెంగాలీ భాషల్లో రాసిన వేలకొద్దీ గ్రంథాలూ ఉన్నాయి; తూర్పు, పడమటి దేశాల వాళ్ళు విరాళంగా ఇచ్చిన వవి. ప్రపంచ పవిత్ర గ్రంథాల సేకరణ గ్రంథరాశి కూడా అక్కడ ఉంది. పురాతత్త్వ, భూవిజ్ఞాన, మానవశాస్త్ర సంబంధమైన ప్రాముఖ్యం గల అమూల్య, శిలల్ని చక్కగా వర్గీకరించి అమర్చి పెట్టిన పురాణ ప్రదర్శనశాల (మ్యూజియం) ఒకటి ఉంది; వాటిలో చాలామట్టుకు, వైవిధ్య సమృద్ధమైన ఈశ్వరుడి భూమి మీద నేను జరిపిన సంచారాల్లో సేకరించినవే.[1]

  1. శ్రీశ్రీ పరమహంస యోగానందగారు సేకరించిన ఆ మాదిరి వస్తువులతో పాశ్చాత్య ప్రపంచంలో కూడా ఒక పురావస్తు ప్రదర్శనశాల ఉంది; అది కాలిఫోర్నియాలోని పసిఫిక్ పాలిసేడ్స్‌లో, సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ సరోవర మందిరంలో ఏర్పాటయి ఉంది. (ప్రచురణకర్త గమనిక).