పుట:Oka-Yogi-Atmakatha.pdf/692

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

656

ఒక యోగి ఆత్మకథ

ఆటల పోటీల్లో తరచుగా కప్పులు సంపాయిస్తూ ఉంటారు. సంకల్ప శక్తి ద్వారా – అంటే, ప్రాణశక్తిని ఒంట్లో ఏ భాగానికయినా సరే మానసికంగా పంపడం ద్వారా – కండరాలకు మళ్ళీ సత్తువ చేకూర్చే “యోగదా” వ్యాయామ పద్ధతిని కుర్రవాళ్ళకు నేర్పుతారు. వాళ్ళు ఆసనాలు, కత్తిసామూ, కర్రసామూ, జుజిట్సు కూడా నేర్చుకుంటారు. ప్రథమ చికిత్సలో శిక్షణ పొందిన రాంచీ విద్యార్థులు, తమ రాష్ట్రంలో వరద, కరువు వంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఎంతో సేవచేసి మెప్పు పొందారు. కుర్రవాళ్ళు తోటలో పనిచేసి చాలా కూరగాయలు పండిస్తారు.

రాష్ట్రంలో ఉన్న కోల్, సంతాల్, ముండా జాతులనే ఆదిమ గిరిజనుల తెగలవారికి ప్రాథమిక విద్యావిషయాలు బోధిస్తారు. దగ్గరి పల్లెల్లో ఆడపిల్లలకు మాత్రమే తరగతులు నడుపుతారు.

రాంచీ విద్యాలయం విశిష్ట లక్షణం క్రియాయోగ దీక్ష ఇవ్వడం. కుర్రవాళ్ళు ప్రతిరోజూ తమ ఆధ్యాత్మిక అభ్యాసాలు సాధనచేస్తూ ఉంటారు. గీతా పారాయణ చేస్తారు; నిరాడంబరత, స్వార్థత్యాగం, గౌరవం, సత్యం అన్న గుణాల్ని ఉపదేశం ద్వారానే కాకుండా ఆచరించి చూపించడమనే ఆదర్శం ద్వారా కూడా బోధించడం జరుగుతున్నది. దుఃఖాన్ని కలిగించేదాన్ని చెడుగానూ నిజమైన సుఖాన్ని ఇచ్చే పనులే మంచిగాను వాళ్ళకు నిర్దేశించడం జరుగుతుంది. చెడును విషం కలిపిన తేనెతో పోల్చవచ్చు; అది మనకు మోహం పుట్టిస్తుంది, కాని అందులో మృత్యువు పొంచి ఉంది.

ధారణ ప్రక్రియలు, శరీరానికి మనస్సుకూ ఉండే అశాంతిని జయించడంలో అద్భుతమైన ఫలితాలు సాధించాయి. కంటికి ఇంపు కలిగించే రూపురేఖలు గల తొమ్మిది పదేళ్ళ కుర్రవాడొకడు, నిశ్చల మన