పుట:Oka-Yogi-Atmakatha.pdf/690

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

654

ఒక యోగి ఆత్మకథ

ఉంది; నా చిన్న రాజ్యంలో నేనే రాజును. దీనికి అవతలున్నది, బాహ్య విషయాల మీద మట్టుకే ఆసక్తి ఉన్న విశాల ప్రపంచం.”

ఆయన ఈ మాటలు అంటూంటే, ఏళ్ళు వెనక్కి దొర్లిపోయినట్టనిపించింది; చీవాట్ల చిచ్చుల కొలిమిలో రాజూ స్వర్ణశుద్ధి జరిగే బాల శిష్యుణ్ణి అయిపోయాను మళ్ళీ.

శ్రీరాంపూర్‌‌నుంచి, కలకత్తానుంచి బయట పడగలిగిన వెంటనే నేను, శ్రీ రైట్‌తో కలసి రాంచీకి బయలుదేరాను. అక్కడ ఏం స్వాగతం! ఏం ఆనందోత్సాహం! నేను లేని ఈ పదిహేనేళ్ళలో విద్యాలయ పతాకాన్ని ఉవ్వెత్తున నిలిపి ఉంచిన, నిస్స్వార్థ బుద్ధిగల ఉపాధ్యాయుల్ని కావలించుకుంటూ ఉంటే, నా కళ్ళలో నీళ్ళు నిలిచాయి. అక్కడి ఆశ్రమవాసి విద్యార్థుల్లోనూ పగటి విద్యార్థుల్లోనూ ఆనందోజ్జ్వలమైన ముఖాలూ ప్రసన్నమైన చిరునవ్వులూ చూస్తుంటే, జాగ్రత్తగా ఆ ఉపాధ్యాయు లిచ్చిన విద్యాలయశిక్షణకూ యోగశిక్షణకూ ఉన్న విలువకు సమృద్ధిగా దాఖలా కనిపించింది.

అయినా, దురదృష్టవశాత్తు, రాంచీ సంస్థ దుర్భరమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. రాచఫాయీకి తగ్గ విరాళాలెన్నో ఇచ్చిన కాశింబజార్ మహారాజు - సర్ మణీంద్రచంద్ర నందిగారు గతించారు; వారిచ్చిన కాశింబజార్ భవనాన్నే ఇప్పుడు కేంద్ర విద్యాలయ భవనంగా మార్చడం జరిగింది. ప్రజాదరణ తగినంతగా లేకపోవడంవల్ల, విద్యాలయంలో ఉచితంగా, ఉదారంగా కల్పించే వసతులు అనేకం తీవ్రంగా దెబ్బతిన్నాయి.

నేను అమెరికాలో ఉన్న అన్నేళ్ళూ, అక్కడి వ్యవహార జ్ఞానమూ అడ్డంకు లెదురై నప్పుడు చూపవలసిన మొక్కవోని కార్యదీక్షా నేర్చుకోకుండా ఉండలేదు. క్లిష్ట సమస్యలతో కుస్తీపడుతూ రాంచీలో ఒకవారం రోజులు ఉండిపోయాను. తరవాత కలకత్తాలో ప్రముఖ నాయకులతోనూ