పుట:Oka-Yogi-Atmakatha.pdf/687

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారతదేశానికి తిరిగి రాక

651

కూడా, కండలు తిరిగిన ఆయన చేతుల్లాగే, శక్తిమంతమైన వన్న సంగతి కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. ఆయన నిటారుగా, ఠీవిగా నడుస్తారు.

“ఆయన నిరాడంబరంగా, మామూలు పంచె కట్టుకుని చొక్కా వేసుకున్నారు. ఒకప్పుడు ఆ రెండూ కాషాయవన్నె అద్దినవే కాని, ఇప్పుడవి వెలిసిపోయిన నారింజవన్నెలోకి దిగాయి.”

“చుట్టూ పరకాయించి చూస్తూ, దాదాపు శిథిలావస్థలో ఉన్న ఆయన గది, తన యజమానికి భౌతిక సుఖాలపట్ల ఉన్న అనాసక్తిని సూచిస్తున్నట్టు గమనించాను. పొడవాటి ఆ గదికున్న తెల్ల గోడలు వాతావరణ ప్రభావానికి గురిఅయి, వెలిసిపోతున్న నీలిపూత చారల్ని కనబరుస్తున్నాయి. గదిలో ఒక చివర లాహిరీ మహాశయుల బొమ్మ ఒకటి వేలాడుతోంది. నిరాడంబరమైన భక్తిని ప్రదర్శించే విధంగా, దానికి ఒక పూలదండ వేసి ఉంది. అక్కడ యోగానందగారి పాత ఫోటో కూడా ఒకటి ఉంది; ఆయన మొదట బోస్టస్ వచ్చినప్పుడు, కాంగ్రెస్ ఆఫ్ రెలిజియన్స్ కు వచ్చిన ఇతర ప్రతినిధులతో కలిసి నిలబడి ఉన్న ఫోటో అది.”

“పాతకొత్తల మేలు కలయిక ఒకటి ఇక్కడ గమనించాను. కొవ్వొత్తి దీపాల గాజు చాందినీ ఒకటీ గోడమీద కాలెండరు ఒకటీ; వాడకపోవడంపల్ల ఆ చాందినీ నిండా సాలీళ్ళు గూళ్ళు కట్టేశాయి, ఇక్కడ గోడమీదున్నది అందమైన సరికొత్త కాలెండరు. గది అంతా శాంతిసౌఖ్యాల సుగంధాన్ని వెదజల్లుతోంది. బాల్కనీకి అవతల, మౌనంగా నిలబడి రక్షణ ఇస్తున్నట్టున్న పొడుగాటి కొబ్బరి చెట్లను చూశాను.”

“అక్కడ ఆసక్తికరమైన విషయ మేమిటంటే - పరమగురువులు ఒక్కసారి ఇలా చప్పట్లు చరిస్తే చాలు, ఆయన అది పూర్తి చేసే లోగానే,