పుట:Oka-Yogi-Atmakatha.pdf/686

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

650

ఒక యోగి ఆత్మకథ

అధికారికత - ఇది ఋషి లక్షణం; తమకు దేవుడు తెలుసు కనక, తమకు తెలుసని తెలిసినవారి లక్షణం. వారి మహత్తరమైన జ్ఞానం, కార్యదీక్ష , నిశ్చయాత్మకత ప్రతిదాంట్లోనూ కళ్ళకు కడుతున్నాయి.

“అప్పుడప్పుడు ఆయన్ని పూజ్యభావంతో పరిశీలిస్తూ నేను గమనించింది ఏమిటంటే... ఆయనది భారీ విగ్రహం, కసరత్తు చేసినట్టున్న శరీరం; సన్యాసంలో ఎదురయే పరీక్షలకల్లా త్యాగాలవల్లా రాటుదేరిన దది. ఆయన దేహభంగిమ రాజసం ఉట్టిపడేలా ఉంటుంది. ఊర్ధ్వలోకాల్ని అన్వేషిస్తూ ఉన్నట్టు కచ్చితంగా ఏటవాలుగా ఉన్న ఆయన నుదురు, ఆయన దివ్యముఖమండలంలోకల్లా ప్రముఖంగా కనిపిస్తుంది. ఆయనకు కొంచెం పెద్ద ముక్కే ఉంది; ఏమీ తోచనప్పుడు దాన్ని చిల్ల పిల్లవాడిలా వేళ్ళలో తాటిస్తూ, ఇటూ అటూ ఆడిస్తూ దాంతో ఆడుకుంటూ ఉంటారు. శక్తిమంతాలైన ఆయన నల్లటి కళ్ళ చుట్టూ ఆకాశ నీలం వన్నె వలయం ఏర్పడి ఉంది. మధ్యలో పాపిడి తీసి ఉన్న ఆయన జుట్టు, నుదుటి చుట్టూ తెల్లగానూ తక్కిన చోట్ల, నిగనిగలాడే బంగారు వన్నె నలుపు వన్నెనూ పోలిన చారలు ఏర్పడి, చివర భుజాల దగ్గర కొసలు ఉంగరాలు తిరిగి ఉన్నాయి. ఆయన గడ్డం, మీసం స్వతహానే కొద్దిగా ఉండవచ్చు! లేదా పలచబడిపోయి ఉండవచ్చు. అయినా ఆయన మొక్కట్లకు అవి అందం చేకూరుస్తున్నాయి; పైగా, ఆయన శీలం మాదిరిగానే అవి ఒత్తుగానూ పలచగానూ కూడా ఉన్నాయి.”

“కులాసాగా నోటి నిండా నవ్వే అలవాటు ఆయన కుంది; ఆ నవ్వు కూడా ఆయన రొమ్ములో లోతునుంచి వస్తుంది; దాంతో ఆయన, ఒళ్ళంతా ఊగిపోయేటట్టు విరగబడి నవ్వుతారు - అందులో ఎంతో ఉల్లాసమూ నిజాయితీ సృష్టమవుతాయి. ఆయన ముఖమూ విగ్రహమూ