పుట:Oka-Yogi-Atmakatha.pdf/685

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారతదేశానికి తిరిగి రాక

649

మాగమంతో వారి కళ్ళు ఎలా మిలమిల మెరిశాయి. వాటిలో ఎంత ఆప్యాయత పెల్లుబికింది! ప్రశాంతమైన ఆ గదిలో స్నిగ్ధతా స్పందన ఒకటి వ్యాపించింది; ఆ సన్నివేశాన్ని అకస్మాత్తుగా దీప్తిమంతం చెయ్యడానికి మబ్బుల్ని తప్పించేసుకున్నాడు సూర్యుడు.

“నేను ఆ పరమ గురుదేవుల ముందు మోకరిల్లి, నా అవ్యక్త ప్రేమా ధన్యవాదాలు అర్పించుకున్నాను; కాలగతిలోనూ సేవలోనూ రాటుదేరిన ఆయన పాదాల్ని తాకి దీవెనలందుకున్నాను. అప్పుడు లేచి, అంతఃపరీక్షతో రగులుతున్న అందమైన రెండు లోతయిన కళ్ళను ఎదురుగా చూశాను; అయినా అవి ఆనందంతో వెలుగుతున్నాయి. వారు కూర్చునే గదిలోకి ప్రవేశించాం. అందులో ఒక పక్క అంతా, మొదట వీధిలోంచి కనిపించిన బాల్కనీలోకి తెరిపిగా ఉంది. పరమ గురువులు గచ్చునేలమీద పరిచిఉన్న పరుపుమీద కూర్చుని ఒక పాత బాలీసుమీద ఆనుకొన్నారు. యోగానందగారూ నేనూ పరమ గురువుల పాదాల దగ్గర, తుంగ చాపమీద కూర్చున్నాం, మేము సుఖంగా కూర్చోడానికి చేర్లబడ్డానికి నారింజవన్నె దిండ్లు ఉన్నాయి.

“స్వాములవార్లిద్దరూ మాట్లాడుకునే బెంగాలీ సంభాషణ అర్థం చేసుకోడానికి చాలా చాలా ప్రయత్నించాను (ఎంచేతంటే, స్వామీజీ మహారాజ్ - ఆ పరమగురువులను ఇతరులు అలాగే పిలుస్తారు - ఇంగ్లీషు మాట్లాడగలవారూ, తరచు మాట్లాడేవారూ అయినప్పటికీ కూడా, వారిద్దరూ కలిశారంటే అక్కడ ఇంగ్లీషు శూన్యమూ వ్యర్థమూ అయిపోతుందని కనిపెట్టాను). అయినా, స్వామిజీ మహారాజ్ ఋషిత్వాన్ని హృదయాహ్లాదకరమైన చిరునవ్వుద్వారా, “మిలమిలలాడే కళ్ళద్వారా సులువుగానే దర్శించాను. సరదాకు అన్నా, గంభీరంగా అన్నా, ఆయన మాటల్లో చటుక్కున గోచరించే లక్షణమేమిటంటే, చెప్పినదాంట్లో సునిశ్చితమైన