పుట:Oka-Yogi-Atmakatha.pdf/684

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

648

ఒక యోగి ఆత్మకథ

యోగానందగారు కాలేజీలో చదివే రోజుల్లో, ఆయనకు ఇష్టమైన ఫలహారశాల. చివరికి, గోడల మధ్యగా సాగిన ఒక సన్న సందులోకి ప్రవేశించాం. చటుక్కున ఎడమవేపుకి ఒక్క మలుపు; అక్కడ మా కెదురుగా, సాదాగా ఉన్న రెండతస్తుల ఆశ్రమ భవనం; దాని బాల్కనీ, పై అంతస్తు నుంచి ముందుకు చొచ్చుకు వచ్చింది. చుట్టూ ప్రశాంతమైన ఏకాంతం.

“గంభీరమైన నమ్రతతో, యోగానందగారి వెనకనే నడిచి ఆశ్రమం గోడల మధ్యనున్న ముంగిట్లో అడుగు పెట్టాను. గుండెలు దడదడా కొట్టుకుంటూ ఉండగా, పాత సిమ్మెంటు సీడీలు ఎక్కడం ప్రారంభించాం. ఇంతవరకు వేలాది సత్యాన్వేషకులు వాటిమీదగా నడిచి ఉంటారనడంలో సందేహం లేదు. మేము అడుగుతీసి అడుగు వేస్తూంటే మాలో ఉత్కంఠ పెరుగుతూ వచ్చింది. మా కెదురుగా మెట్లపైన, ఋషిసహజమైన ఉదాత్తగంభీర భంగిమలో నిలబడి, ప్రశాంతంగా దర్శనమిచ్చారు, మహామహులు స్వామి శ్రీయుక్తేశ్వర్‌గారు.”

“వారి పవిత్ర సన్నిధిలో నిలిచే భాగ్యం కలిగినందుకు ధన్యుణ్ణి అయానన్న అనుభూతి కలుగుతూ ఉండగా నా గుండె ఎగిసి పడింది. యోగానందగారు మోకాళ్ళ మీదికి వాలి, తల వంచి సర్వాత్మనా కృతజ్ఞతాంజలులు అర్పిస్తూ చేతులతో గురుదేవుల పాదాలు స్పృశించి, ఆ తరవాత వినయాంజలిగా తమ నుదుటికి తాకిస్తూ ఉండగా, ఉత్సుకతతో చూస్తున్న నా చూపును అలుక్కుపోయేటట్టు చేశాయి, కన్నీళ్ళు. తరవాత ఆయన లేచారు; అప్పుడు శ్రీయుక్తేశ్వర్‌గారు ఆయన రెండు భుజాలూ హత్తుకొని కౌగలించుకున్నారు.

“మొదట్లో మాటలు పెకలలేదు; అయినా, ఆత్మకున్న మౌనభాషలో అత్యంత గాఢమైన అనుభూతి అభివ్యక్తమయింది. ఆత్మపునస్స