పుట:Oka-Yogi-Atmakatha.pdf/677

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శిలువ గాయాలున్న థెరిసా నాయ్‌మన్

641

లాట నుంచి థెరిసాను కాపాడడానికే. అంతకు ముందటేళ్ళలో అయితే, శుక్రవారాల్లో వేల కొద్దీ జనం గుమిగూడుతూ ఉండేవాళ్ళు.

శుక్రవారం పొద్దున సుమారు తొమ్మిదిన్నరకి మేము కానర్‌స్రాత్ చేరాం. థెరిసా కుటీరంలో, పై కప్పుగా గాజు పలకలు అమర్చిన భాగం ఒకటి ఉందనీ, అది ఆమెకు సమృద్ధిగా వెలుతురు రావడానికి ఏర్పాటు చేసిందనీ గమనించాను. తలుపు లిప్పుడు మూసి లేవు; ఆనందంగా స్వాగతం పలుకుతూ బార్లా తెరుచుకుని ఉన్నందుకు సంతోషించాం. సుమారు ఇరవై మంది సందర్శకులు బారుగా నిలబడి ఉన్నారు; ప్రతి ఒక్కరి చేతిలోనూ ఒక అనుమతి పత్రం ఉంది. ఆమె అద్భుత సమాధి స్థితిని దర్శించడానికి చాలా దూరాలనుంచి వచ్చినవాళ్ళు అనేకమంది ఉన్నారు.

నే నామెను చూడడానికి వచ్చింది కేవలం, తాత్కాలికమైన కుతూహలాన్ని తృప్తి పరుచుకోడానికి కాక, ఆధ్యాత్మిక హేతువులవల్ల వచ్చానన్న సహజావబోధంతో థెరిసా, ప్రొఫెసరుగారి ఇంట్లో నా మొదటి పరీక్షలో నెగ్గింది.

నా రెండో పరీక్ష ఏమిటంటే, మేడమీదున్న ఆమె గదిలోకి మెట్లెక్కి వెళ్తున్నప్పుడు నేను, ఆమెతో అతీంద్రియ భావగ్రహణ, దర్శనపరమైన అనుసంధాన స్థితి పొందడంకోసం, నన్ను నేను యోగ సమాధిలోకి తెచ్చుకున్నాను. సందర్శకులతో నిండి ఉన్న ఆమె గదిలోకి ప్రవేశించాను. ఆమె తెల్లటి దుస్తులతో పక్కమీద పడుకొని ఉంది. నాకు సరిగా వెనకాల శ్రీరైట్ ఉన్నాడు. గుమ్మంలో అడుగుపెట్టి విచిత్రంగా, అత్యంత భయంకరంగా ఉన్న దృశ్యాన్ని చూసి విస్మయం చెంది అక్కడే ఆగిపోయాను.

థెరిసా కింది కనురెప్పల నుంచి నెత్తురు, అంగుళం వెడల్పు