పుట:Oka-Yogi-Atmakatha.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

46

ఒక యోగి ఆత్మకథ

త్వరలోనే వచ్చింది. నాకు తెలుసు; లాహిరీ మహాశయుల దివ్యసంకల్పం ఆ డాక్టరుద్వారాను- మీ నాన్నగారితో సహా- రైల్వే అధికారుల ద్వారాను బాగా పనిచేసింది. దాంతో వాళ్ళంతట వాళ్ళు, మహాగురువు ఆధ్యాత్మిక ఆదేశాన్ని శిరసావహించి, ఆ ప్రేమమయుడైన భగవంతుడితో నేను అవిచ్ఛిన్నమైన సాంగత్యం అనుభవించడానికి వీలుగా, నన్ను విముక్తుణ్ణి చేసి స్వేచ్ఛాజీవితం ప్రసాదించారు.”

ఈ అసాధారణ విషయం వెల్లడించిన తరవాత ప్రణవానంద స్వామివారు చాలాసేపు, మామూలు అలవాటు ప్రకారం, మౌనంలో ఉండి పోయారు. నేను సెలవు తీసుకొంటూ ఆయన పాదాలు గౌరవపూర్వకంగా స్పృశించినప్పుడు నన్నిలా ఆశీర్వదించారు:

“నీ జీవితం భౌతిక సుఖాల్ని విడిచిపెట్టి యోగసాధన మార్గంలో సాగుతుంది. నిన్ను మళ్ళీసారి మీ నాన్నగారితో చూస్తాను.” తరవాత కొన్నేళ్ళకు ఈ రెండు జోస్యాలూ ఫలించాయి.

చీకటి ముసురుతూ ఉండగా, కేదారనాథ్‌బాబు నా పక్కన నడుస్తూ వచ్చారు. మా నాన్న గారిచ్చిన ఉత్తరం ఆయనకు అందించాను. దాన్ని ఆయన వీధి దీపం దగ్గర చదువుకున్నారు.

“వాళ్ళ రైల్వే కంపెనీ కలకత్తా ఆఫీసులో నన్ను ఉద్యోగంలో చేరమని సలహా ఇస్తున్నారు మీ నాన్నగారు. ప్రణవానంద స్వామిగారు అనుభవించే పెన్షన్లలో కనీసం ఒక్కదాని కోసమయినా ఎదురు చూడ్డం ఎంత సంతోషించవలసిన విషయం! కాని అది అసంభవం! నేను కాశీ వదిలి వెళ్ళలేను. నా కింకా రెండు శరీరాలు లేవు కదా!”