పుట:Oka-Yogi-Atmakatha.pdf/667

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శిలువ గాయాలున్న థెరిసా నాయ్‌మన్

631

పాశ్చాత్యదేశాలు కూడా తయారు చేస్తాయని బాబాజీ చెప్పిన జోస్యం నెరవేరడం, ఈయన్నీ మరికొందరు పాశ్చాత్యుల్నీ చూసినప్పుడు గ్రహించి సంతోషించాను.

నా ప్రయాణాల ఖర్చుకు తామే విరాళమిస్తామని పట్టుపట్టి, ఔదార్యం చూపించారు లిన్. ఆర్థిక సమస్య అలా పరిష్కారమవడంతో నేను, యూరప్ గుండా ఇండియాకు ఓడలో ప్రయాణం చెయ్యడానికి ఏర్పాట్లు చేసుకున్నాను. 1935 మార్చిలో, సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ సంస్థను, కాలిఫోర్నియా రాష్ట్ర చట్టాల ప్రకారం, చిరస్థాయిగా మనుగడ సాగించడానికి రూపొందించిన మతాంతశ్శాఖారహితమైన, లాభార్జనరహితమైన సంస్థగా రిజిస్టరు చేయించాను. నా రచనలన్నిటి మీదా ఉన్న హక్కులతో సహా, నా కున్నవన్నీ సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్‌కు విరాళంగా ఇచ్చేశాను. అనేక ఇతర మత, విద్యాసంస్థల్లాగే సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కూడా సభ్యులు ప్రజలూ అందించిన ధర్మనిధుల మీదా విరాళాల మీదా ఆధారపడింది.

“నేను మళ్ళీ వస్తాను. అమెరికాని ఎన్నడూ మరిచిపోను,” అని చెప్పాను నా విద్యార్థులకు.

ప్రేమాస్పదులైన మిత్రులు కొందరు లాస్ ఏంజిలస్‌లో నా కిచ్చిన వీడ్కోలు విందులో, వాళ్ళ మొహాలవేవు చాలాసేపు చూసి, కృతజ్ఞతతో ఇలా అనుకున్నాను, “ప్రభూ, ఏకైక ప్రదాతవు నువ్వేనన్న సంగతి గుర్తుంచుకున్నవాడికి, మర్త్యుల్లో స్నేహమాధుర్యం కొరవడ్డం ఉండదు.”

1935 జూన్ 9 న న్యూయార్కులో ‘యూరోపా’ అనే ఓడలో బయలుదేరాను. నాతోబాటు, ఇద్దరు విద్యార్థులు వచ్చారు: నా కార్యదర్శి శ్రీ. పి. రిచర్డ్ రైట్, సిన్సినాటీ వాస్తవ్యురాలైన ఒక వృద్ధురాలు మిస్ ఎటీ బెట్. అంతకు ముందు వారాలు పనుల హడావిడిలో గడిస్తే, ఇప్పుడు