పుట:Oka-Yogi-Atmakatha.pdf/666

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం : 39

శిలువ గాయాలున్న

థెరిసా నాయ్‌మన్

“భారతదేశానికి తిరిగి వచ్చెయ్యి. నీకోసం పదిహేనేళ్ళు ఓపిక పట్టి ఎదురు చూశాను. త్వరలో నేను ఈ శరీరాన్ని వదిలి, అటుతరవాత నా కాంతిమయ నివాసానికి చేరుకుంటాను. యోగానందా, రా!”

ఒకనాడు మౌంట్ వాషింగ్టన్ ప్రధాన కార్యాలయంలో నేను ధ్యానం చేసుకుంటూ ఉండగా శ్రీయుక్తేశ్వర్‌గారి స్వరం నా లోచెవిలో వినిపించి నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. ఆయన సందేశం ఒక్క రెప్ప పాటు కాలంలో పదివేల మైళ్ళు ప్రయాణించి, మెరుపులా నాలోకి దూసుకు వచ్చింది.

పదిహేనేళ్ళు! ఔను, ఇప్పుడు నడుస్తున్నది 1935 అని గ్రహించాను; మా గురుదేవుల ఉపదేశాల్ని అమెరికాలో వ్యాప్తి చెయ్యడానికి పదిహేనేళ్ళు గడిపాను. ఇప్పుడాయన నన్ను వెనక్కి పిలుస్తున్నారు.

తరవాత కొద్ది వ్యవధిలో, నా ప్రియమిత్రుడైన శ్రీ.జేమ్స్ జె. లిన్‌కు నా అనుభవం చెప్పాను. ప్రతి రోజూ క్రియాయోగ సాధనవల్ల ఆయన పొందిన ఆధ్యాత్మికాభివృద్ధి గణనీయతనుబట్టి నే నాయన్ని తరచుగా ‘సెయింట్ లిన్’ (లిన్ ఋషి) అని పిలుస్తూండేవాణ్ణి. సనాతన యోగపద్ధతి ద్వారా ఆత్మసాక్షాత్కారం పొందే నిజమైన ఋషుల్ని