పుట:Oka-Yogi-Atmakatha.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెండు శరీరాలున్న సాధువు

45

“నీకు ఏది అనిపిస్తే అది.[1]

“ఆ మర్నాడు నేను దరఖాస్తు పెట్టాను. సర్వీసు పూర్తికాక ముందే ఉద్యోగంలోంచి విరమిస్తానంటూ పెన్షను కోరడానికి కారణా లడిగాడు డాక్టరు.”

“పనిచేస్తుంటే, నా వెన్నులో, నన్ను వివశుణ్ణి చేసే సంచలనం పుడుతోంది. అది నా శరీరమంతటా వ్యాపించి, నా విధులు నేను నిర్వర్తించుకోడానికి అనర్హుణ్ణి చేస్తోంది.”

“అలా అన్న మీదట, ఆ డాక్టరు, ఇంక నన్నేమీ అడక్కుండా నాకు పెన్షను మంజూరు చేయవలసిందిగా గట్టిగా సిఫార్సు చేశాడు. అది

  1. గాఢమైన ధ్యానంలో ఉన్నప్పుడు బ్రహ్మానుభవం కలిగేది మొదట వెనుబామనే గద్దెమీద; తరవాత మెదడులో. ఆనందమనే వెల్లువ మనల్ని ముంచెత్తుతుంది; కాని యోగి అయినవాడు, దాని సూచనలు బయటికి కనబడకుండా అదుపుచేయడం నేర్చుకుంటాడు. నిజానికి, మేము కలుసుకొన్నప్పటికే ప్రణవానందగారు జ్ఞానపూర్ణులైన గురువులు. కాని అంతకు అనేక సంవత్సరాల ముందే ఆయన ఉద్యోగ జీవనంలో చివరి రోజులు గడిచాయి; అప్పటికాయన నిర్వికల్ప సమాధిలో తిరుగులేకుండా కుదురుకోలేదు. పరిపూర్ణం, అచంచలం అయిన అచేతనావస్థలో ఉన్నప్పుడు, ప్రాపంచిక విధుల్లో ఏది నిర్వర్తించడానికన్నా, యోగికి కష్టం అనిపించదు. పదవీవిరమణ చేసిన తరవాత, ప్రణవానందగారు, ప్రణవగీత అన్న గ్రంథం రాశారు. బెంగాలీ, హిందీ భాషల్లో ఉన్న ఈ వ్యాఖ్యాన గ్రంథం, భగవద్గీత మీద అపార పాండిత్య స్ఫూర్తితో రచించినది. ఒకటికి మించి ఎక్కువ దేహాల్లో కనిపించే శక్తి ఒక సిద్ధి (యోగశక్తి): దీన్ని గురించి పతంజలి యోగసూత్రాల్లో చెప్పాడు. ఒకే మనిషి రెండుచోట్ల ఉండడమనే దృగ్విషయం అనేక యుగాలుగా, అనేకమంది సాధువుల జీవితాల్లో కళ్ళకు కడుతూనే వచ్చింది.