పుట:Oka-Yogi-Atmakatha.pdf/655

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నా అమెరికా ప్రయాణం

619

పరిహారాన్ని అందిస్తాయన్న సంగతి ఎవరు శంకించగలరు? భగవంతుడు ఒక దేశం శాశ్వతసౌభాగ్యాన్ని దాని సుగుణ సంపత్తితో ముడి పెట్టకుండా ఉంటాడా?”

వాల్ట్ విట్మన్ రాసిన “హిమ్ టు అమెరికా"

(“దౌ మదర్ విత్ దై ఈక్వల్ ట్రూడ్” లోంచి)

“నీ భవిష్యత్తులో నువ్వు,

  స్త్రీపురుషుల విస్తార, విజ్ఞతాయుత చింతనలో నువ్వు - నీ
          నైతిక, ఆధ్యాత్మిక క్రీడాకారుల్లో; దక్షిణం, ఉత్తరం,
          పడమర తూర్పుల్లో నువ్వు,

  నీ నైతిక సంపదలో, నాగరికతలో (అప్పటిదాకా అతిగర్విష్ట
          మైన నీ భౌతిక నాగరికత వ్యర్థంగా ఉండవలసిందే)
          నువ్వు,

  నీ సర్వార్థసాధక, సర్వగ్రాహక ఆరాధనలో- కేవలం ఏ
          ఒక్క మతగ్రంథంలోనో, రక్షకుడితోనో ఉండి
          పోకుండా నువ్వు,

  నీ రక్షకులు అసంఖ్యాకులు, నీ లోనే అంతర్నిహితులు, ఒకరి
          కొకరు సమానులూ ఒకరిలో ఒకరు దివ్యులూ . . .

  ఇవన్నీ! ఇవన్నీ నీలో (తప్పక జరుగుతాయని) జోస్యం
           చెబుతున్నా నీ రోజు.”