పుట:Oka-Yogi-Atmakatha.pdf/654

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

618

ఒక యోగి ఆత్మకథ

చర్చిల్లో, అన్ని రకాల శ్రోతల సమావేశాల్లోనూ ప్రసంగించాను. 1920 - 1930 మధ్య దశాబ్దిలో కొన్ని లక్షలమంది అమెరికన్లు నా యోగవిద్యా తరగతులకు హాజరయారు. వాళ్ళందరికీ నేను, 1929 లో, ప్రార్థనలూ పద్యాలూ గల కొత్త పుస్తకం ఒకటి అంకితం చేశాను; ‘విస్పర్స్ ఫ్రం ఎటర్నిటీ’ అన్న ఈ పుస్తకానికి, ప్రఖ్యాత గాయని ఎమిలీటా గలీకుర్సీ పీఠిక రాశారు.

ఒక్కొక్కప్పుడు (మామూలుగా, నెలలో ఒకటో తారీఖున, సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ప్రధాన కార్యాలయం మౌంట్ వాషింగ్టన్ సెంటర్ నిర్వహణకు అయిన ఖర్చుకు బిల్లులు చుట్టచుట్టుకుని వచ్చి పడ్డప్పుడు) భారతదేశపు నిరాడంబర ప్రశాంతికోసం ఉవ్విళ్ళూరుతూ దాన్ని తలుచుకునేవాణ్ణి. కాని ప్రతిరోజూ, తూర్పు పడమటి దేశాల మధ్య అవగాహన విస్తరిస్తూ ఉండడం గమనించేవాణ్ణి; నా ఆత్మ ఆనంద తరంగితమయేది.

అనేక సందర్భాల్లో తనకు దైవ మార్గదర్శిత్వం లభించినట్టు అనుభూతి పొందిన “స్వదేశపిత,” జార్జి వాషింగ్టన్ (తన “వీడుకోలు ప్రసంగం”లో) అమెరికాకు ఆధ్యాత్మికో త్తేజం కలిగించే మాటలు ఇలా అన్నాడు:

“స్వతంత్రమై, జ్ఞానసంపన్నమై, అద్యతన భావిలోనే ఘనత నందుకోగల దేశం మానవజాతికి అందించడానికి తగినది, సర్వదా సమున్నతన్యాయమూ లోకహితమూ నడిపించినట్టుగా నడుచుకొనే ప్రజల ఉదార, అతినవ్య ఆదర్శం (అంటే, అమెరికా ప్రజలు ఆ విధంగా మానవజాతి కొక ఆదర్శంగా నడుచుకోవాలి). కాల, చరిత్రల గతిలో అటువంటి ప్రణాళికల వల్ల కలిగే ఫలితాలు, దానికి నిలకడగా కట్టుబడి ఉండడం వల్ల కోల్పోవలసి వచ్చే ఏ తాత్కాలిక ప్రయోజనాలకయినా సమృద్ధిగా