పుట:Oka-Yogi-Atmakatha.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

44

ఒక యోగి ఆత్మకథ

“అప్పుడు నాకు చెప్పలేనంత ఉద్దీపన కలిగింది. ఇంటికి తిరిగి వెళ్ళాను. ఆ రోజు రాత్రి ధ్యానావస్థలో తపించిపోయే నా జీవిత లక్ష్యాన్ని సాధించాను. ఇప్పుడు నిరంతరాయంగా నా ఆధ్యాత్మిక భరణాన్ని అనుభవిస్తున్నాను. ఆనాటి నుంచి మరెన్నడూ, ఆనందమయుడైన ఆ సృష్టికర్త, ఏ మాయావరణం మాటునా నాకు కనుమరుగు కాలేదు.”

ప్రణవానందగారి ముఖం దివ్యతేజస్సుతో ప్రకాశిస్తూ ఉంది. పారలౌకిక ప్రశాంతి నా హృదయంలోకి ప్రవేశించింది; నాలోని భయం పలాయనం చేసింది. ప్రణవానందగారు మరో రహస్యం చెప్పారు నాకు.

“కొన్ని నెలల తరవాత మళ్ళీ ఒకసారి లాహిరీ మహాశయుల దగ్గరికి వెళ్ళాను. నాకు అనంతమైన వరం ప్రసాదించినందుకు ఆయనకు నేను ధన్యవాదాలు చెప్పడానికి ప్రయత్నించాను. అప్పుడు ఆయనతో మరో విషయం ప్రస్తావించాను.

“గురుదేవా, నే నింక ఆఫీసులో పని చెయ్యలేను. దయ ఉంచి నన్ను ఈ చెరనుంచి విడుదల చెయ్యండి. బ్రహ్మదేవుడు నన్ను ఎడతెరిపి లేకుండా మత్తులో ఉంచుతున్నాడు.”

“మీ కంపెనీ నించి పెన్షనుకు దరఖాస్తు పెట్టు.”

“నా ఉద్యోగ జీవితంలో ఇంత త్వరగా పెన్షనుకు దరఖాస్తు పెట్టడానికి కారణం ఏమని చెప్పను?”