పుట:Oka-Yogi-Atmakatha.pdf/648

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

612

ఒక యోగి ఆత్మకథ

చెయ్యి పైకెత్తి, తరవాత వెళ్ళిపోతుంటే నా కళ్ళు ఆయనమీదే నిలిచి పోయాయి, లాలసతో.

కొన్ని నిమిషాల తరవాత నా పాదాలకు స్వేచ్ఛ వచ్చింది. నేను మళ్ళీ కూర్చుని గాఢమైన ధ్యానంలోకి వెళ్ళాను; నా ప్రార్థనను మన్నించి సమాధాన మివ్వడమే కాకుండా, బాబాజీ ఆగమనభాగ్యం నాకు కలిగించినందుకు, దేవుడికి నిర్విరామంగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. సనాతనులూ నిత్యయౌవనపూర్ణులు అయిన మహాగురువుల స్పర్శతో నా శరీరం పావనమయింది. ఆయన్ని దర్శించాలన్న గాఢమైన కోరిక చిరకాలంగా నా మనస్సులో ఉంటూ వచ్చింది.

నేను బాబాజీని కలుసుకున్న ఉదంతం ఇప్పటిదాకా ఎవ్వరికీ చెప్పలేదు. నా మానవ జీవితానుభవాల్లో కల్లా దాన్ని అత్యంత పవిత్రంగా భావించి, నా గుండెలోనే దాచి పెట్టుకున్నాను. లోక ప్రయోజనాలపట్ల ఆసక్తిగల, ఏకాంతవాసులైన బాబాజీని నా కళ్ళతో నేను చూశానన్న సంగతి చెబితే, ఈ ఆత్మకథ చదివే పాఠకులు, ఆయన ఉనికి వాస్తవమే నన్న సంగతి నమ్మడానికి సుముఖులవుతారన్న అభిప్రాయం నాకు కలిగింది. ఈ పుస్తకం కోసం, ఆధునిక భారతీయ యోగీశ్వరుల యథార్థ చిత్రాన్ని గీయడానికి నేనొక చిత్రకారుడికి సాయపడ్డాను.

అమెరికాకు బయలుదేరడానికి ముందునాటి రాత్రి, శ్రీయుక్తేశ్వర్‌గారి పవిత్ర సన్నిధిలో ఉన్నాను. “నువ్వు హిందువుల్లో పుట్టావన్న సంగతి మరిచిపో, అయినా అమెరికన్ల జీవిత పద్ధతుల్లోవి అన్నీ అలవరుచుకోకు; రెండు దేశాల ప్రజల్లోనూ ఉత్తమమైనవి తీసుకో,’ అని చెప్పారాయన, తమకు సహజమైన ప్రశాంత జ్ఞానోపదేశ రీతిలో. “దేవుడి కుమారుడిగా, నిజమైన నీ ఆత్మస్వరూపంలోనే ఉండు. వివిధ జాతుల్లో,