పుట:Oka-Yogi-Atmakatha.pdf/640

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

604

ఒక యోగి ఆత్మకథ

గురుదేవుల ఉజ్జ్వలరూపాన్ని నా గదిలోనే చూసి ఆనందం పట్టలేక పోయాను.

“ ‘కాశీకి రావాలని తొందరెందుకు?’ అన్నాడు, చిరునవ్వు చిందిస్తూ. ‘నన్నింక అక్కడ చూడవు.’ ”

“ఆయన మాటల్లో అర్థం నాకు స్ఫురించేసరికి, గుండె పగిలి వలవలా ఏడ్చేశాను; ఆయన్ని కేవలం అంతర్దర్శనంలోనే చూస్తున్నానని నమ్మి.”

“గురుదేవులు. ఓదార్పుగా నా దగ్గరికి వచ్చారు. ‘ఇక్కడ, నా కండ పట్టి చూడు,’ అన్నారు. ‘ఎప్పటిలాగే నేను జీవించి ఉన్నాను. దుఃఖపడకు; ఎప్పటికీ నీతోనే ఉండడం లేదూ?’ ”

ఈ ముగ్గురు మహాశిష్యుల నోళ్ళనుంచీ అద్భుత సత్యాన్ని తెలిపే కథ బయల్పడింది: లాహిరీ మహాశయుల దేహం మంటలకు ఆహుతి అయిన మర్నాడు, పొద్దున పది గంటలవేళ - రూపాంతరం చెందినప్పటికీ - వాస్తవమైన దేహంతో మూడు వేరువేరు నగరాల్లో, ముగ్గురు శిష్యుల ముందు ఆయన సాక్షాత్కరించారు.

“నశ్వరమైన దీనికి అనశ్వరత సిద్ధిస్తే, మర్త్యుడు అమరత్వం సాధిస్తే అప్పుడు, మృత్యువును విజయం కబళించేసిందన్న లిఖిత సూక్తి రుజువవుతుంది. మరణమా, ఎక్కడ నీ కాటు? శ్మశానమా, ఎక్కడ నీ

విజయం?[1]

  1. కోరింథీయులకు 15 : 54-55 (బైబిలు). “చనిపోయిన వాళ్ళని దేవుడు లేపుతాడన్న సంగతి నమ్మలేని మాటగా ఎందుకసుకోవాలి మీరు?" అపొస్తలుల కార్యాలు 26 : 8 (బైబిలు).