పుట:Oka-Yogi-Atmakatha.pdf/639

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాశ్చాత్య ప్రపంచం గురించి బాబాజీ ఆసక్తి

603

నప్పుడు, గురుదేవుల చితాభస్మంలో కొంతభాగం కూడా తీసుకునివెళ్ళాను. నాకు తెలుసు, దేశకాలావధులు గల పంజరంలోంచి ఆయన తప్పించుకు పోయారని, సర్వవ్యాపకతా విహంగం విముక్తమయిందని. అయినా, ఆయన చితాభస్మానికి సమాధి కట్టించడం నా మనసుకు ఊరట కలిగించింది.”

పునరుత్థానం చెందిన గురుదేవుల్ని దర్శించే భాగ్యం పొందిన మరో శిష్యులు, సాధుప్రవృత్తిగల పంచానన్ భట్టాచార్య[1] గారు. నేను కలకత్తాలో ఆయన ఇంటికి వెళ్ళి, గురుదేవులతో ఆయన గడిపిన అనేక సంవత్సరాల వృత్తాంతాన్ని ఆనందంగా విన్నాను. చివర, తమ జీవితంలోకల్లా అత్యద్భుతమైన ఘట్టం ఒకటి చెప్పారాయన.

“లాహిరీ మహాశయుల దహనం జరిగిన మర్నాడు పొద్దున పది గంటలకి, ఇక్కడ కలకత్తాలో, జీవద్విభవంతో నా ముందు ప్రత్యక్షమయారాయన.”

రెండు శరీరాల సాధువు - స్వామి ప్రణవానందగారు కూడా తమ అతీంద్రియానుభూతిని నాకు వివరించారు. మా రాంచీ విద్యాలయాన్ని సందర్శించిన సందర్భంలో, ప్రణవానందగారు నా కిలా చెప్పారు.

“లాహిరీ మహాశయులు శరీరాన్ని విడిచి పెట్టడానికి కొన్నాళ్ళ ముందు, ఆయన దగ్గర్నించి నాకో ఉత్తరం వచ్చింది; నన్ను వెంటనే కాశీకి రమ్మని రాశారాయన, అందులో. అయితే, తప్పనిసరి ఆటంకంవల్ల నా ప్రయాణం ఆలస్యమయింది; వెంటనే బయలుదేరలేకపోయాను. నేను కాశీ ప్రయాణానికి సిద్ధమవుతూ ఉండగా, పొద్దున పదిగంటల వేళ , మా

  1. పంచానన్ భట్టాచార్యగారు, బీహారులో ఉన్న దేవగఢ్‌లో, పదిహేడెకరాల తోటలో శివాలయం ఒకటి నిర్మించారు; అందులో లాహిరీ మహాశయుల తైలవర్ణ చిత్రం ఒకటి ప్రతిష్టించారు.