పుట:Oka-Yogi-Atmakatha.pdf/638

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

602

ఒక యోగి ఆత్మకథ

నా గుండె. క్రీస్తు, కబీర్[1]ల శిష్యులు, తమ గురుదేవుల్ని, వారి భౌతిక మరణానంతరం సజీవరూపంలో దర్శించినప్పుడు ఎటువంటి ఆత్మోన్నతి అనుభూతమయిందో నాకూ అటువంటిదే అనుభూతమయింది.

“హరిద్వారంలో ఉన్న నా ఏకాంత ఆశ్రమానికి నేను తిరిగి వెళ్ళి

  1. కబీరు, పదహారో శతాబ్దినాటి గొప్ప సాధువు. ఆయన శిష్యుల్లో హిందువులూ ముస్లిములూ కూడా ఉండేవారు. కబీరు నిర్యాణానంతరం ఆయన శిష్యులు, ఆయనకు అంత్యక్రియలు జరపవలసిన విధానం గురించి తగువులాడుకున్నారు. దానికి ఆగ్రహం కలిగిన ఆ గురువు, దీర్ఘ నిద్రనుంచి లేచి, వాళ్ళకి ఆదేశాలిచ్చాడు. “నా అవశేషాల్లో సగం, ముస్లిం విధి ప్రకారం పాతిపెట్టండి,” అన్నాడాయన. “మిగిలిన సగం హిందూ సంస్కారాన్నిబట్టి దహనం చెయ్యండి.” తరవాత అదృశ్యమయాడు. అప్పుడు శిష్యులు, ఆయన శవంమీద కప్పిన గుడ్డ తీసేసరికి అక్కడ, అందమైన పూల బారు ఒకటి తప్ప ఇంకేమీ కనిపించలేదు. వాటిలో సగం తీసుకుని ముస్లిములు, మగ్హర్‌లో భక్తి శ్రద్ధలతో సమాధిచేశారు; వాళ్ళు ఇప్పటికీ ఆ సమాధికి మొక్కుతూ ఉంటారు. తక్కిన సగం, హిందూ సంస్కారానుసారంగా కాశీలో దహనం చేశారు. కబీరు పడుచు వయస్సులో ఉండగా, మార్మిక మార్గంలో సూక్ష్మమైన జ్ఞానోపదేశం కావాలని కోరుతూ ఇద్దరు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు. వాళ్ళకి, ఆ గురువు టూకీగా ఇలా జవాబిచ్చాడు:

    “కో ఈ కహత్ దూరీ హై యహ్ కీ దూరక్ బాత్ నిరాసీ,
      సో తేరో మన్ మోహి విరాజే అమర్ పురుష్ అవినాసీ,
      మోహిం సుని-సుని ఆవే హాఁసీ,
      పానీ మే మీస్ పియాసీ.”

      (దారి అంటూ చెప్పినప్పుడు దూరమనేది ఉంటుంది దానికి;
      ఆయన దరిదాపులోనే ఉంటే, నీకో దారి అన్నదే అవసరం లేదు.
      నాకు నవ్వొస్తూ ఉంటుంది,
      నీళ్ళలో చేపకు దాహంగా ఉందని ఎవరైనా చెప్పగా విన్నప్పుడు!)