పుట:Oka-Yogi-Atmakatha.pdf/636

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

600

ఒక యోగి ఆత్మకథ

అద్భుతమైన వివరాలు అనేకం, ఉన్నత స్థితి నందుకొన్న, స్వామి కేశవానంద[1] అనే శిష్యుల నోటి మీదగా విన్నాను.

“మా గురుదేవులు శరీరాన్ని విడిచి పెట్టడానికి కొన్నాళ్ళముందు, నేను హరిద్వారంలో నా ఆశ్రమంలో కూర్చుని ఉండగా, నా ఎదుట ఆయన సాక్షాత్కరించారు.”

“ ‘వెంటనే కాశీకి రా.’ ఈ మాటలతో లాహిరీ మహాశయులు అదృశ్యమయారు.”

“వెంటనే నేను రైలెక్కి కాశీకి బయలుదేరాను. మా గురుదేవుల ఇంట్లో చాలామంది శిష్యులు చేరి ఉన్నారు. ఆ రోజున[2] గురుదేవులు కొన్ని గంటలపాటు గీతను వ్యాఖ్యానిస్తూ ఉపన్యసించారు; ఆ తరవాత మాతో టూకీగా ఇలా అన్నారు:

“ ‘నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను.’ ”

“మాలో దుఃఖం కట్టలు తెంచుకుని వచ్చింది; వెక్కి వెక్కి ఏడిచాం.”

“ ‘కుదుటపడండి. నేను మళ్ళీ లేచి వస్తాను. ఈ ముక్క అన్న తరవాత లాహిరీ మహాశయులు తమ ఆసనంమీంచి లేచారు; తమ శరీరాన్ని గుండ్రంగా మూడుసార్లు తిప్పారు; ఉత్తరంవేపు తిరిగి

  1. నేను కేశవానందగారి ఆశ్రమాన్ని సందర్శించిన సందర్భం 42 అధ్యాయంలో వివరించడం జరిగింది.
  2. లాహిరీ మహాశయులు దేహత్యాగం చేసిన రోజు 26 సెప్టెంబరు 1895. మరి కొన్నాళ్ళలో ఆయనకి అరవైఏడో ఏడు వచ్చేది.