పుట:Oka-Yogi-Atmakatha.pdf/630

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

594

ఒక యోగి ఆత్మకథ

గతాన్ని మళ్ళీ వెనక్కి రప్పించి ఆయన పాదపద్మాలకు భక్తితో మొక్కడానికి మళ్ళీ మరోసారి ఆయన సన్నిధిలో ఉండగలిగితే ఎంత బాగుండును!’

“ ‘పరవాలేదు,’ అంటూ ఊరడింపుగా అన్నారు లాహిరీ మహాశయులు. ‘నిన్ను మళ్ళీ చూస్తానని ఆయన మాట ఇచ్చారు.’

“ ‘గురుదేవా, దైవతుల్యులైన ఆ గురువులు మీకో వర్తమానం అందించమని చెప్పారు నాకు, “లాహిరీకి చెప్పు: ఈ జన్మకోసం నిలవచేసి ఉంచిన శక్తి ఇప్పుడు చాలా తక్కువ స్థాయిలో ప్రవహిస్తూ ఉంది; అది దాదాపు అయిపోయినట్టే.’ ”

“గూఢార్థం గల ఈ మాటలు నేను అనీ అనడంతోటే లాహిరీ మహాశయుల విగ్రహం, పిడుగువచ్చి మీద పడ్డట్టుగా కంపించిపోయింది. ఒక్క లిప్తలో అంతా నిశ్శబ్దమైపోయింది; చిరునవ్వు చిందే ఆయన ముఖకవళిక ఊహించరానంత కఠినమై పోయింది. గంభీరంగా, నిశ్చలంగా కూర్చుని ఉన్న కొయ్యబొమ్మ మాదిరిగా, ఆయన దేహం వివర్ణమయింది. నేను భయభ్రాంతుణ్ణి అయాను. ఈ ఆనందమూర్తి అంత ఆశ్చర్యకరమైన గాంభీర్యం ప్రదర్శించడం నా జీవితంలో అంతకు ముందెన్నడూ చూడలేదు. అక్కడున్న తక్కిన శిష్యులు నావేపు భయం భయంగా చూశారు.”

“మూడు గంటలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. అప్పుడు లాహిరీ మహాశయులు, తమకు సహజమైన ప్రసన్నతను తిరిగి పొంది, ప్రతి శిష్యుడితోటీ ఆప్యాయంగా మాట్లాడారు. ప్రతివారికీ మనస్సు తేలికపడింది.”

“మా గురుదేవుల్లో వచ్చిన ఈ మార్పునుబట్టి, బాబాజీ సందేశం స్పష్టమైన ఒక సంకేతమనీ దాన్ని బట్టి లాహిరీ మహాశయులు తమ