పుట:Oka-Yogi-Atmakatha.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42

ఒక యోగి ఆత్మకథ

గురించి నాకు తెలియజెప్పడం, నా కిశోర హృదయంలో ఆధ్యాత్మిక ఉద్దీపన కలిగించడానికి చేసిన ప్రయత్నమే కావచ్చు. కాని దాంతో, నాలో ఉత్సాహం కలగడానికి బదులు భక్తిభావంతో కూడిన భయమే అనుభూతమైంది. భగవంతుడి కోసం నేను సాగించే అన్వేషణ శ్రీ యుక్తేశ్వర్ గారు– అప్పటికింకా నేను ఆయన్ని కలుసుకోనే లేదు– అనే ఒకానొక గురువు ద్వారా కొనసాగించాలన్నది దైవనిర్ణయమై ఉన్నందువల్ల ప్రణవానందగారిని గురువుగా స్వీకరించడానికి నాలో సుముఖత కలగ లేదు. నాకు ఎదురుగా ఉన్నాయన అసలైన ప్రణవానందగారా, లేకపోతే ఆయన ప్రతిరూపమా అని ఆలోచిస్తూ సంశయాత్మకంగా ఆయనవైపు చూశాను.

“నే నెరిగిన వాళ్ళందరిలోకి లాహిరీ మహాశయులు చాలా గొప్ప యోగి. మానవరూపం ధరించిన దేవుడే ఆయన.”

తమ సంకల్పమాత్రం చేత ఒక శిష్యుడే అదనంగా మరో మానవ శరీరాన్ని సృష్టించుకోగలిగినప్పుడు, ఆయన గురువుగారికి సాధ్యంకాని మహిమలంటూ ఏముంటాయి అనుకున్నాను.