పుట:Oka-Yogi-Atmakatha.pdf/628

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

592

ఒక యోగి ఆత్మకథ

తమ కథనంలో ఈ అంశందగ్గిర, శ్రీయుక్తేశ్వర్‌గారు, తమ దృష్టి పూర్తిగా నా మీద కేంద్రీకరించారు.

“ ‘నాయనా, అనేక సంవత్సరాలకు పూర్వమే, నా దగ్గరికి పంపుతానని బాబాజీ మాట ఇచ్చిన శిష్యుడివి నువ్వే,’ అన్నారు. గురుదేవులు, పండు వెన్నెట్లో చిరునవ్వు చిందిస్తూ.”

బాబాజీయే నాకు, శ్రీయుక్తేశ్వర్‌గారి సన్నిధికి దారి చూపించి నడిపించారని తెలిసి సంతోషించాను; అయినా నా గురువర్యులకూ నిరాడంబర ఆశ్రమ ప్రశాంతికి దూరంగా, ఎక్కడో దూరాన ఉన్న పాశ్చాత్య ప్రపంచంలో నా ఉనికిని ఊహించుకోడం నాకు కష్టమయింది.

“తరవాత బాబాజీ, భగవద్గీత గురించి మాట్లాడారు,” అంటూ చెప్పసాగారు, శ్రీయుక్తేశ్వర్‌గారు. “గీతలో చాలా అధ్యాయాలకి నేను వ్యాఖ్యలు రాశానన్న సంగతి తమకి తెలుసునన్నట్టుగా, మెచ్చుకుంటూ కొన్ని మాటల్లో ఆయన సూచించడంతో ఆశ్చర్యచకితుణ్ణి అయాను.

“నా కోరిక మన్నించి, స్వామీజీ, మీకు మరో పని చేపట్టండి.” అన్నారు మహాగురువులు. ‘క్రైస్తవ, హిందూ పవిత్ర గ్రంథాలకి మూలభూతంగా ఉన్న ఏకత్వాన్ని గురించి మీరో చిన్న పుస్తకం రాయరూ? ఉత్ప్రేరితులైన దైవపుత్రులు అవే సత్యాల్ని ప్రవచించారనీ, మానవుల పాక్షిక భేదాలవల్ల వాటి ఏకత్వం ఇప్పుడు మరుగుపడిపోయిందనీ, సమానార్థక గ్రంథభాగాలు ఉదాహరిస్తూ నిరూపించండి.’ ”

“ ‘మహారాజ్, ఎటువంటి ఆజ్ఞ! దాన్ని నెరవేర్చగలనా నేను?” అంటూ సంకోచపడుతూ సమాధాన మిచ్చాను.

“బాబాజీ మృదువుగా నవ్వారు. ‘నాయనా, నువ్వెందుకు సందేహిస్తావు?’ అంటూ నాకు నమ్మకం కలిగించేలా అన్నారు. ‘నిజానికి,