పుట:Oka-Yogi-Atmakatha.pdf/618

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

582

ఒక యోగి ఆత్మకథ

తెలివిగా కనుమరుగుచేసి ఉంచిన మతశాస్త్రాన్ని, రూపకాది అలంకారాల ఆవరణ నుంచి తప్పించి, లాహిరీ మహాశయులు వెలుగులోకి తెచ్చారు. వేదమంత్రాలు పూర్తిగా వైజ్ఞానిక ప్రాముఖ్యమున్నవన్న సంగతి ఈ మహాగురువులు నిరూపించిన మీదట, ఇప్పుడవి, అర్థంకాని మాటల గారడీ అనిపించడం మానేశాయి...”

“విషయవాంఛల ఉద్ధత ప్రాబల్యం ముందు, మనిషి మామూలుగా నిస్సహాయుడై ఉంటాడని మనకి తెలుసు. కాని మనిషిలో క్రియాయోగం ద్వారా అధికతర శాశ్వతానంద చైతన్యం ఉదయించినప్పుడు ఈ విషయ వాంఛల్ని అది శక్తిహీనం చేస్తుంది; వాటికి తాను లోలుడయే ఉద్దేశం మనిషిలో కనిపించదు. ఇక్కడ ఈ నివృత్తి- అంటే, అధమ విషయ వాంఛల తృణీకారం, మరో ప్రవృత్తికి, అంటే, పరమానందానుభూతి ప్రాప్తికి - సమకాలంలో జరుగుతుంది. అటువంటి మార్గం ఒకటి లేనట్లయితే, కేవల నివృత్తిబోధకమైన నీతిసూత్రాలు మనకు నిరుపయోగ మవుతాయి.

“దృశ్యమాన విషయాలన్నిటి వెనకా ఉండేది అనంతం; అది మహాశక్తి సాగరం. ప్రపంచ కార్యకలాపాలమీద ఉన్న ఆసక్తి మనలో