పుట:Oka-Yogi-Atmakatha.pdf/610

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

574

ఒక యోగి ఆత్మకథ

కున్న చాతుర్యానికి అంతులేనట్టు కనిపిస్తున్నప్పటికీ, అనంత సహాయ రూపుడైన భగవంతుడు, చాతుర్యంలో మనిషికన్న తక్కువవాడేమీ కాడు.”

గురుదేవుల సర్వవ్యాపకత్వం శిష్యబృందానికి ఒక నాడు ప్రదర్శిత మయింది; ఆయన భగవద్గీతను వివరిస్తూ ఉండగా శిష్యులు వింటున్నారు. స్పందనశీలమైన సృష్టి అంతటిలోనూ ఉన్న కూటస్థ చైతన్యానికి అర్థం వివరిస్తూ ఉండగా లాహిరీ మహాశయులు, హఠాత్తుగా ఎగుశ్వాసతో అరిచారు;

“జపాను తీరసముద్రంలో, అనేక ఆత్మల శరీరాల్లో నేను మునిగి పోతున్నాను!”

మర్నాడు పొద్దున, టెలిగ్రాం ద్వారా వచ్చిన పత్రికా సమాచారం చదివారు శిష్యులు; అందులో, ముందు రోజున, జపాను సమీపంలో ఓడ మునిగి కొందరు చనిపోయారన్న వార్త ఉంది.

లాహిరీ మహాశయుల శిష్యుల్లో దూరాన ఉన్నవాళ్ళు చాలామంది ఆయన తమకు సమీపంలోనే ఉన్న సంగతి ఎరుగుదురు, “క్రియాయోగ సాధన చేసేవాళ్ళ దగ్గర నేను ఎప్పుడూ ఉంటాను,” అని చెప్పేవారాయన, తమకు దగ్గరలో ఉండలేకపోతున్న శిష్యులకు ఊరటగా. “నిరంతరం విస్తరించే మీ ఆధ్యాత్మిక అనుభూతుల ద్వారా బ్రహ్మాండ నిలయానికి మీకు దారి చూపిస్తుంటాను.”

ఆ మహాగురువుల ప్రఖ్యాత శిష్యులైన శ్రీ భూపేంద్రనాథ్ సన్యాల్,[1] పడుచు వయస్సులో ఉండగా 1892 లో, కాశీకి వెళ్ళలేక,

  1. శ్రీ సన్యాల్ 1962 లో మరణించారు (ప్రచురణకర్త గమనిక).