పుట:Oka-Yogi-Atmakatha.pdf/608

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

572

ఒక యోగి ఆత్మకథ

వారయి లాహిరీ మహాశయులు, తమ కాలంలో ఉన్న కఠినమైన కుల దురభిమానాన్ని అంతమొందించడానికి సాహసోపేతమైన ప్రయత్నాలు చేశారు. అన్ని జీవిత మార్గాలవాళ్ళు, సర్వవ్యాపకమైన గురుదేవుల రెక్కల నీడన ఆశ్రయం పొందేవారు. దైవప్రేరితులైన ప్రవక్తలందరి మాదిరిగానే లాహిరీ మహాశయులు, సమాజం నుంచి వెలిఅయినవాళ్ళకి దళితజాతుల వాళ్ళకి ఒక కొత్త ఆశ కలిగించారు.

“నువ్వెవ్వరివాడివీ కావనీ, ఎవ్వరూ నీవారు కారనీ గుర్తుంచుకో. ఎప్పుడో ఒకనాడు నువ్వు హఠాత్తుగా ఈ ప్రపంచంలో ప్రతిదీ వదిలేసి పోవలసి ఉంటుందని తలుచుకో – కాబట్టి దేవుడితో ఇప్పుడే పరిచయం చేసుకో,” అని చెబుతూండేవారు మహాగురువులు, తమ శిష్యులకు. “ప్రతిరోజూ, దైవానుభూతి అనే గాలిగుమ్మటంలో ఎగురుతూ, రాబోయే మృత్యువనే సూక్ష్మయాత్రకు తయారవు. మాయవల్ల నిన్ను నువ్వు, మాంసాస్థుల కట్టగా చూసుకుంటున్నావు; నిజానికది కష్టాలు కాపురం చేసే గూడు మాత్రమే.[1] ఎడతెరిపిలేకుండా ధ్యానం చెయ్యి; ఏ విధమైన క్లేశమూ లేని అనంతతత్త్వంగా, నిన్ను నువ్వు తొందరగానే చూసుకుంటావు. శరీరానికి బందీవై ఉండడం మానెయ్యి; క్రియాయోగమనే రహస్య కీలకాన్ని ఉపయోగించి, శరీరంనుంచి తప్పించుకొని పరమాత్మ సన్నిధిలోకి పారిపోవడం నేర్చుకో.”

వివిధ శిష్యుల్ని, తమతమ మత విశ్వాసాలకు సంబంధించిన సత్సంప్రదాయ నిష్ఠకు కట్టుబడి ఉండమని గురుదేవులు ప్రోత్సహించేవారు. విముక్తికి సాధనానుకూలమైన ప్రక్రియగా క్రియాయోగానికున్న సర్వార్థసాధక స్వభావాన్ని నొక్కిచెబుతూ లాహిరీ మహాశయులు,

  1. ఎన్ని రకాల చావులున్నాయి మన శరీరాల్లో! చావుతప్ప మరొకటి అందులో లేనే లేదు.” – మార్టిన్ లూథర్.