పుట:Oka-Yogi-Atmakatha.pdf/607

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లాహిరీ మహాశయుల పావన జీవనం

571

“వృత్తి - ఉద్యోగ, సామాజిక విధులు నిర్వర్తించిన తరవాత, భక్తియుక్తమైన ధ్యానానికి టై మెక్కడ ఉంటుంది?” అన్న సామాన్యమైన సవాలుకు సమాధానమివ్వడానికి ప్రయత్నించారు. మహనీయులైన ఈ గృహస్థ గురువుల సామరస్య సంతులిత జీవనం, వేలకొద్దీ స్త్రీపురుషులకు ఉత్ప్రేరణ అయింది. స్వల్పమైన జీతం ఆర్జిస్తూ, మితవ్యయం చేస్తూ, నిరాడంబరంగా, సర్వజనసులభులైన ఈ గురువులు, క్రమశిక్షణ గల ప్రాపంచిక జీవన మార్గంలో సహజంగా, సుఖంగా సాగారు.

పరమాత్ముడి స్థానంలో పదిలంగా కుదురుకొని ఉన్నప్పటికీ, లాహిరీ మహాశయులు, మనుషుల యోగ్యతల్లో తరతమాలతో నిమిత్తం లేకుండా, అందరిపట్లా పూజ్యభావం ప్రదర్శించేవారు. తమ భక్తులు ఎప్పుడు ప్రణామం చేసినా, ఆయన వాళ్ళకు ప్రతినమస్కారం చేస్తూ వంగేవారు. పిల్లవాడి కుండేటంత వినయంతో ఆయన, తరచుగా ఇతరుల పాదాలు తాకుతూ ఉండేవారు. అయితే, గురువుపట్ల అటువంటి విధేయత చూపించడం సనాతనమైన ప్రాచ్యదేశ ఆచారమే అయినప్పటికీ, తమకు మాత్రం అటువంటి గౌరవం ఇవ్వడానికి ఆయన ఇతరులను అనుమతించడం అరుదు.

లాహిరీ మహాశయుల జీవితంలో విలక్షణంగా చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, ప్రతి మతంవాళ్ళకీ క్రియాయోగ దీక్ష ఇవ్వడం. హిందువులొక్కరే కాదు; ముస్లిములూ క్రైస్తవులూ కూడా ఆయన ప్రముఖ శిష్యుల్లో ఉన్నారు. అద్వైతులూ ఇతర మతాలవాళ్ళు లేదా వ్యవస్థితమైన ఏ మతానికి చెందినవాళ్ళూ కూడా ఈ జగద్గురువుల ఆదరం నిష్పక్షపాతంగా పొంది, ఉపదేశం అందుకునేవారు. ఆయన శిష్యుల్లో ఉన్నతస్థాయి నందుకున్నవాళ్ళలో ఒకడు అబ్దుల్ గఫూర్ ఖాన్; ఈయన ముస్లిం. తాము సర్వోన్నతమైన, బ్రాహ్మణ కులానికి చెందిన