పుట:Oka-Yogi-Atmakatha.pdf/598

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

562

ఒక యోగి ఆత్మకథ

“ ‘హల్వా[1] తయారుచేయించండి.’ తమ భౌతిక వాస్తవికత విషయమై అక్కడివాళ్ళకి మరింత నమ్మకం కలిగించడం కోసం బాబాజీ ఈ కోరిక కోరారని నాకు తెలుసు, పాయసం ఉడుకుతూ ఉండగా దివ్య గురువులు, చనువుగా మాట్లాడారు. సంశయాళువులైన ఈ ‘థామస్‌లు,’ భక్తశిఖామణులైన ‘సెంట్ పాల్‌ల’ మాదిరిగా మారిపోవడం గొప్పగా జరిగింది. మేము హల్వా తిన్న తరవాత, బాబాజీ ఒక్కొక్కరినే ఆశీర్వదించారు. హఠాత్తుగా ఒక్క మెరుపు మెరిసింది; బాబాజీ దేహం తాలూకు ఋణవిద్యుదణు (ఎలక్ట్రానిక్) మూలకాలు తక్షణమే రసాయన విఘటనం చెంది, విస్తరించే బాష్పమయ కాంతిలా మారిపోవడం మేము కళ్ళారా చూశాం. దైవానుసంధానం పొందిన గురుదేవుల సంకల్పశక్తి, ఆయన శరీరంగా సంఘటితమై ఉన్న ఈథర్ పరమాణువుల మీద తనకున్న పట్టు సడలించింది; వెంటనే కోట్లాదిగా ఉన్న చిన్న ప్రాణకణికా విస్ఫు లింగాలు (లైఫ్‌ట్రానిక్ స్పార్క్స్) అనంత ప్రాణాశయంలోకి అంతర్హిత మయాయి.

“ ‘మృత్యుంజయుల్ని నా కళ్ళతో నేను చూశాను.’ వాళ్ళలో మైత్ర[2] అనే ఆయన పూజ్యభావంతో అన్నాడు. కొత్త జాగృతి కలిగించిన

  1. వెన్నతో వేయించి, పాలలో మరిగించిన పిండి (‘గోధుమ పాల మీగడ’ మాదిరిది) తో తయారుచేసే ఒక రకం పాయసం.
  2. ఉత్తరోత్తరా, ఆత్మసాక్షాత్కార సాధనలో గొప్ప ప్రగతి సాధించిన కారణంగా, మైత్ర మహాశయులుగా పేరు పొందిన వ్యక్తి. నేను హైస్కూలు చదువు పూర్తి చేసుకున్న కొత్తలో మైత్ర మహాశయుల్ని కలుసుకున్నాను, నేను కాశీలో ఆశ్రమవాసిగా ఉన్నప్పుడు ఆయన, మహామండల ఆశ్రమాన్ని సందర్శించారు, మురాదాబాద్ మిత్రబృందం ముందు బాబాజీ సాక్షాత్కరించడం గురించి అప్పుడు చెప్పారాయన నాకు. “ఈ అలౌకిక అద్భుత ఘటన ఫలితంగా, నేను లాహిరీ మహాశయులకు యావజ్జీవ శిష్యుణ్ణి అయాను.” అని నాకు చెప్పారు మైత్ర మహాశయులు.