పుట:Oka-Yogi-Atmakatha.pdf/588

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

552

ఒక యోగి ఆత్మకథ

“బ్రాహ్మ ముహూర్తంలో క్రతువు పూర్తి అయింది. ఆనంద తన్మయావస్థలో నాకు నిద్ర అవసరమనే అనిపించలేదు. అమూల్య నిధులతో, అద్భుత కళాఖండాలలో నిండి ఉన్న మహాసౌధంలోని గదులన్నిటిలోనూ తిరిగి, తరవాత ఉద్యానవనాల్ని సందర్శించాను. దగ్గరిలో, నిన్నటి రోజున నేను చూసిన గుహల్నీ రాతిగొట్టు కొండ అంచుల్నీ గమనించాను కాని అప్పుడివి, ఒక మహాసౌధాన్నీ పూలతోటల్నీ ఆనుకుని లేవు.”

“చల్లటి హిమాలయ సూర్యరశ్మిలో అద్భుతంగా మెరిసిపోతున్న ప్రాసాదంలో మళ్ళీ అడుగుపెట్టి, నా గురుదేవుల సన్నిధికి చేరాను. ఆయన ఇంకా సింహాసనం మీద ఉపవిష్టులై , ప్రశాంత శిష్యగణంచేత పరివేష్టితులై ఉన్నారు.”

“ ‘లాహిరీ, నీకు ఆకలి వేస్తోంది,’ అంటూ బాబాజీ, ‘కళ్ళు మూసుకో,’ అన్నారు.”

“నేను మళ్ళీ కళ్ళు తెరిచేసరికి, మనోహరమైన మహాసౌధమూ దాని ఉద్యానవనాలూ అదృశ్యమయిపోయాయి. నా శరీరమూ బాబాజీ రూపమూ వారి శిష్యుల రూపాలూ, అదృశ్యమైన మహాసౌధం స్థానంలో, ఎండపడుతున్న రాతిగుహల ద్వారాలకు దగ్గరిలోనే కటిక నేల మీద ఉన్నాయి. బంగారు భవనం మాయమయిపోతుందనీ దాంట్లో బందీలై ఉన్న పరమాణువులు విడుదలయి, తా ముద్భవించడానికి మూలకందమైన ఆలోచనాసారరూపంలో లయమవుతాయని, నన్నిక్కడికి తీసుకువచ్చి నాయన చెప్పిన సంగతి గుర్తు చేసుకున్నాను. నేను ఆశ్చర్యంతో స్తంభించినా, నా గురుదేవుల వంక సంపూర్ణ విశ్వాసంతో చూశాను. అలౌకిక అద్భుత ఘటనలు జరుగుతున్న ఈ రోజు ఇంకా ఏం ఆశించాలో నాకు తెలియలేదు.

“ ‘భవనాన్ని సృష్టించడానికి ఆశించిన ప్రయోజనం ఇప్పుడు