పుట:Oka-Yogi-Atmakatha.pdf/586

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

550

ఒక యోగి ఆత్మకథ

“తరవాత అతను, ‘ఈ భవనం ప్రయోజనం తీరిపోగానే బాబాజీ దాన్ని అదృశ్యం చేసేస్తారు’ అని చెప్పాడు.

“ఆశ్చర్యంతో నేను అవాక్కునై ఉండిపోగా, నాకు దారి చూపిస్తున్నాయన, ఆ భవనం వేపు చెయ్యి చాపి చూపిస్తూ ఇలా అన్నాడు: “అమూల్య రత్నాలతో అద్భుతంగా అలంకృతమై ధగద్ధగాయమానంగా ఉన్న ఈ రాజసౌధం, మానవ ప్రయత్నంతో నిర్మించింది కాదు; దాని బంగారమూ, రత్నాలూ కష్టపడి గనిలోంచి తవ్వినవేమీ కావు. ఇది జ్ఞాపకచిహ్నరూపంలో, మానవుడి కొక సవాలుగా ఘనాకృతిలో నిలిచి ఉంది.[1] బాబాజీ మాదిరిగానే, తనను దైవసంతానంగా అనుభూతం కావించుకున్నవాడు, తనలో మరుగుపడి ఉన్న అనంత శక్తులచేత ఏ లక్ష్యాన్నయినా చేరుకోగలడు. ఒక మామూలు రాతిలో కూడా బ్రహ్మాండమైన అణుశక్తులు[2] గుప్తంగా నిక్షిప్తమై ఉంటాయి; అదే విధంగా, అత్యల్పుడైన మర్త్యుడు సైతం దివ్యశక్తికి ఉత్పాదకస్థానమే.’ ”

“ఆ సాధువు, దగ్గరలో ఉన్న ఒక బల్లమీంచి నాజూకు పనితనం ఉట్టిపడే పూలపాత్ర (వాజ్) ఒకటి అందుకొన్నాడు; దాని పిడి, వజ్రాలతో మెరిసిపోతోంది. ‘మన మహాగురువులు అనేక లక్షల స్వతంత్ర విశ్వకిరణాల్ని ఘనీభవింపజేసి ఈ సౌధం నిర్మించారు,’ అంటూ చెప్ప

  1. “అలౌకిక ఘటన అంటే ఏమిటి? - అదొక మందలింపు. మానవజాతి మీద గుప్తమైన అధిక్షేపణ అది."

    -ఎడ్వర్డ్ యంగ్, ‘నైట్ థాట్స్’ లో.

  2. వైశేషిక, న్యాయ దర్శనాలనే ప్రాచీన భారతీయ గ్రంథాల్లో, పదార్థ అణునిర్మాణ సిద్ధాంతాన్ని వివరించడం జరిగింది. “ప్రతి అణుగర్భంలోనూ, సూర్యకిరణంలోని అసంఖ్యాకమైన రజోకణాల మాదిరిగా విశాల జగత్తులు ఇమిడి ఉన్నాయి.” - యోగవాశిష్ఠం.