పుట:Oka-Yogi-Atmakatha.pdf/583

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హిమాలయాల్లో మహాభవన సృష్టి

547

“అడవి గుండా అతడు దారి తీశాడు. దారిలో ఒక మలుపు దగ్గర నేను, నిశ్చలమైన ఒక కాంతిపుంజాన్ని దూరంనుంచి చూశాను.”

“ ‘అది సూర్యోదయం కావచ్చునా?’’ అని అడిగాను. ‘నిజంగా రాత్రి అంతా గడవలేదు కదూ?’ ”

“ ‘ఇది అర్ధరాత్రి సమయం,’ అన్నాడతను మృదువుగా నవ్వుతూ. దూరాన కనిపించే ఆ వెలుగు, అసదృశులైన బాబాజీ నీ కోసం ఈ రాత్రి సృష్టించిన బంగారు భవనం ధగద్ధగలు. సుదూరమైన గతంలో నువ్వొకసారి, మహాభవనం అందాలు చూసి ఆనందించాలన్న కోరిక వెల్లడించావు. మన గురుదేవులు ఇప్పుడు నీ కోరిక తీరుస్తున్నారు; ఆ విధంగా నిన్ను, నీ చిట్టచివరి కర్మానుబంధం నుంచి విముక్తుణ్ణి చేస్తున్నారు.’[1] తరవాత ఇంకా చెప్పాడతను. ‘ఈ రోజు రాత్రి నీకు క్రియాయోగ దీక్ష ఇచ్చే చోటు, రమణీయమైన ఈ మహాభవనమే. నీ ప్రవాసం ముగిసి నందుకు సంతోషిస్తూ నీ సోదరులందరూ కలిసి ఇక్కడ స్వాగతం చెబుతున్నారు. చూడు!’ ”

“మా ఎదుట, కళ్ళు మిరుమిట్లు గొలిపే బ్రహ్మాండమైన ఒక బంగారు భవనం ఉంది. లెక్కలేనన్ని రత్నాలతో అలంకరించి ఉండి, సువిశాలమైన ఉద్యానవనాల మధ్య సుస్థితమై, నిశ్చలమైన జలాశయాల్లో ప్రతిబింబిస్తూ - అసదృశమైన శోభతో విరాజిల్లుతున్న అద్భుతదృశ్యం! చాలా ఎత్తయిన కమానులకు గొప్ప గొప్ప వజ్రాలు, ఇంద్రనీలాలు, పచ్చలూ సంకీర్ణ రీతిలో పొదిగి ఉన్నాయి. కెంపులతో ఎర్రబారి వెలు

  1. కర్మసూత్రం ప్రకారం, మానవుడి ప్రతి కోరికా చివరికి తీరి తీరవలసిందే. కోరిక, ఈ విధంగా మానవుణ్ణి పునర్జన్మ చక్రానికి కట్టేసే గొలుసన్న మాట.